controversy: హిందూ మహాసభ పండల్‌లో రాజుకున్న వివాదం...అసురుడిగా మహాత్మాగాంధీని చిత్రీకరణ

ABN , First Publish Date - 2022-10-03T16:32:41+05:30 IST

భారత జాతిపిత మహాత్మాగాంధీని హిందూ మహాసభ అవమానించిన ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలోని దుర్గామాత మండపంలో జరిగింది...

controversy: హిందూ మహాసభ పండల్‌లో రాజుకున్న వివాదం...అసురుడిగా మహాత్మాగాంధీని చిత్రీకరణ

కోల్‌కతా(పశ్చిమబెంగాల్): భారత జాతిపిత మహాత్మాగాంధీని హిందూ మహాసభ అవమానించిన ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలోని దుర్గామాత మండపంలో జరిగింది. కోల్‌కతాలోని( Kolkata) హిందూ మహాసభ యొక్క పండల్‌లో(Hindu Mahasabhas pandal) మహాత్మా గాంధీని(Mahatma Gandhi) మహిషాసురుడిగా చిత్రీకరించడం వివాదానికి(controversy) దారితీసింది. అసుర అనే రాక్షసుడిని మహాత్మా గాంధీగా చిత్రీకరించిన అఖిల భారత హిందూ మహాసభ నిర్వాహకులు ఇబ్బందుల్లో పడ్డారు.అఖిల భారతీయ హిందూ మహాసభ నిర్వహించిన దుర్గా పూజా పండల్‌లో మహాత్మా గాంధీని పోలిన అసురుడిని చిత్రీకరించారు.దీనిపై వివాదం చెలరేగడంతో హోం మంత్రిత్వ శాఖ ఒత్తిడి మేర పూజ నిర్వాహకులు గాంధీ చిత్రాన్ని మార్చారు.


‘‘మేం గాంధీని నిజమైన అసురుడిగా చూస్తాం. అందుకే మేం మూర్తిని ఇలా తయారు చేశాం’’ అని ఆల్ ఇండియా హిందూ మహాసభ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూర్ గోస్వామి చెప్పారు.గాంధీని అన్ని చోట్ల నుంచి తొలగించి, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇతర స్వాతంత్ర్య సమరయోధులను ముందు ఉంచాలనుకుంటున్నామని గోస్వామి చెప్పారు.పురాణాల ప్రకారం దుర్గాదేవి దుష్ట పాలనను అంతం చేయడానికి మహిషాసురుడిని వధించింది. బెంగాల్  హిందూ మహాసభ చేసిన పనిని పలు పార్టీల నేతలు ఖండించారు.

Updated Date - 2022-10-03T16:32:41+05:30 IST