ఉండమంటే ఉంటా..పొమ్మంటే పోతా!
ABN , First Publish Date - 2022-12-13T02:44:46+05:30 IST
గవర్నర్ పదవిలో తాను కొనసాగాలో..రాజీనామా చేయాలో చెప్పాలంటూ మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. ఛత్రపతి శివాజీ,

అమిత్‌షాకు మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ లేఖ
ముంబై, డిసెంబరు 12: గవర్నర్ పదవిలో తాను కొనసాగాలో..రాజీనామా చేయాలో చెప్పాలంటూ మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతా్పలపై ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఒకప్పుడు మీకిష్టమైన నాయకులు ఎవరంటే నెహ్రూ, గాంధీజీ, నేతాజీ పేర్లు చెప్పేవారని.. మహారాష్ట్రలో పూర్వకాలంలో శివాజీ ఉండేవారని.. ఆ తర్వాత బీఆర్ అంబేడ్కర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వంటి నేతలున్నారని గత నెలలో ఓ సన్మాన కార్యక్రమంలో కోశ్యారీ వ్యాఖ్యానించారు. అయితే గడ్కరీ స్పందిస్తూ.. శివాజీ తమకు దేవుడని.. తల్లిదండ్రులకంటే ఎక్కువగా పూజిస్తామని అన్నా రు. కానీ శివాజీతో అంబేడ్కర్, గడ్కరీలను పోల్చడంపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ ఆయనపై విరుచుకుపడుతున్నాయి. బీజేపీ, షిండే శివసేన కూడా కోశ్యారీ తీరుపై అసంతృప్తి వెలిబుచ్చాయి. ఆయన వివరణ ఇచ్చినా వివాదం సద్దుమణగడం లేదు. దాంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. తనకు మార్గనిర్దేశం చేయాలని అమిత్‌షాకు కోశ్యారీ ఈనెల 6నే లేఖ రాశారు.
Read more