Online Tests: మద్రాసు వర్సిటీ ఆన్లైన్ పరీక్షల్లో మోసం?
ABN , First Publish Date - 2022-10-11T13:52:00+05:30 IST
మద్రాసు విశ్వవిద్యాలయ(University of Madras) దూరవిద్యావిభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ సెమిస్టర్లో భారీయెత్తున అవినీతి

- బీకాం, బీబీఏ డిగ్రీల కోసం 116 మంది యత్నం
- అసిస్టెంట్ రిజిస్ట్రార్లు సహా ఐదుగురి సస్పెన్షన్
చెన్నై, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): మద్రాసు విశ్వవిద్యాలయ(University of Madras) దూరవిద్యావిభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ సెమిస్టర్లో భారీయెత్తున అవినీతి జరిగినట్లు విచారణ కమిటీ నిగ్గు తేల్చింది. 116 మంది విద్యార్థులు కోర్సుల్లో చేరకుండానే బీకాం, బీబీఏ పట్టాలు పొందినట్లు ధ్రువీకరించింది. కొంతమంది యూనివర్సిటీ అధికారులకు భారీగా లంచాలిచ్చి ఈ పట్టాలు పొందినట్లు కూడా సాక్ష్యాధారాలతో సహా నివేదిక సిద్ధం చేసింది. ఈ డిగ్రీలు పొందటానికి ఒక్కో అభ్యర్థి రూ.3లక్షల వరకు లంచమిచ్చినట్లు వర్సిటీ లా కోర్సుల విభాగం డైరెక్టర్ చొక్కలింగం నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో ఏర్పాటైన విచారణ కమిటీ పేర్కొంది. ఇదిలా వుండగా కమిటీ వెలుగులోకి తెచ్చిన నిందితులు అసిస్టెంట్ రిజిస్ట్రార్లు తమిళ్‌వానన్, మోహన్‌కుమార్, సహాయాధికారులు ఎళిల్అరసి,శాంతకుమార్, జాన్ వెస్లిన్ను సస్పెండ్ చేస్తూ వైస్‌ఛాన్సలర్ గౌరీ ఆదేశాలు జారీ చేశారు.