Chennai: మదురై ఎయిమ్స్‌కు కొత్త పేరు ?

ABN , First Publish Date - 2022-08-23T15:36:48+05:30 IST

మదురైలోని అఖిల భారత వైద్య విఙ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)ఆస్పత్రితో పాటు దేశ వ్యాప్తంగా 23 ఎయిమ్స్‌ ఆస్పత్రుల పేరు మార్చేందుకు కేం

Chennai: మదురై ఎయిమ్స్‌కు కొత్త పేరు ?

అడయార్‌(చెన్నై), ఆగస్టు 22: మదురైలోని అఖిల భారత వైద్య విఙ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)ఆస్పత్రితో పాటు దేశ వ్యాప్తంగా 23 ఎయిమ్స్‌ ఆస్పత్రుల పేరు మార్చేందుకు కేంద్రం కసరత్తులు ప్రారంభించింది. ఈ ఆస్పత్రులకు ఆయా రాష్ట్రాలకు చెందిన స్వాతంత్య్ర సమయోధులు, ప్రఖ్యాత క్రీడాకారులు ఇతర ప్రముఖుల పేర్లు పెట్టాలని భావిస్తుంది. ఈ విధంగా పేర్లు మార్చాలని భావిస్తున్న ఎయిమ్స్‌ ఆస్పత్రుల జాబితాలో భోపాల్‌, భువనేశ్వర్‌(Bhopal and Bhubaneswar), జోధ్‌పూర్‌, పాట్నా, రాయ్‌పూర్‌, రిషికేశ్‌, నాగ్‌పూర్‌, రాయ్‌బరేలి, మదురె సహా మొత్తం 23 ఎయిమ్స్‌ ఆస్పత్రులున్నాయి. 

Read more