ఈ రైలు పొడవు 3.5 కి.మీ!

ABN , First Publish Date - 2022-08-17T07:00:43+05:30 IST

కోచ్‌కు ఇంకో కోచ్‌ దానికి మరో కోచ్‌ తగిలించుకుంటాయి కాబట్టి రైళ్లన్నాక ఎంతో కొంత పొడుగ్గానే ఉంటాయి. ఆ రైలుకు మాత్రం తొలి వ్యాగన్‌ నుంచి

ఈ రైలు పొడవు 3.5 కి.మీ!

సూపర్‌ వాసుకి గూడ్స్‌ రైలు ఆవిష్కరణ 

294 వ్యాగన్లు.. 27వేల టన్నుల సామర్థ్యం

దేశంలో అత్యంత పొడవైన గూడ్స్‌ రైలు ఇదే


న్యూఢిల్లీ, ఆగస్టు 16: కోచ్‌కు ఇంకో కోచ్‌ దానికి మరో కోచ్‌ తగిలించుకుంటాయి కాబట్టి రైళ్లన్నాక ఎంతో కొంత పొడుగ్గానే ఉంటాయి. ఆ రైలుకు మాత్రం తొలి వ్యాగన్‌ నుంచి చివరి వ్యాగన్‌కు వెళ్లాలంటే ఓ ఆటో మాట్లాడుకోవాల్సిందే! నడిచి వెళ్లాలని సాహసం చేస్తే మూడున్నర కిలోమీటర్లు నడవాలి! ఆ రైలు అంత పొడవన్నమాట! ఇంత పొడవైన రైలు ఎక్కడో కాదు.. మన దేశంలోనే ఉంది. పేరు ‘సూపర్‌ వాసుకి’. సూపర్‌ వాసుకి ఓ గూడ్స్‌ రైలు. ఆజాదీకి అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పంద్రాగస్టు రోజున దీన్ని ఆవిష్కరించారు. ఛత్తీ్‌సగఢ్‌లోని బిలాయ్‌ నుంచి 224 కి.మీ దూరంలోని కోర్బాకు బయలుదేరింది. ఈ రైలుకు మొత్తంగా 295 వ్యాగన్లు ఉంటాయి. ఈ రైలు ద్వారా 27వేల టన్నుల బొగ్గును తరలించవచ్చు. ఈ బొగ్గును ఓ పవర్‌ ప్లాంట్‌కు తరలిస్తే విద్యుత్తుగా మార్చడానికి రోజంతా పడుతుంది. 3వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి అవుతుంది. మనదేశంలో అత్యంత పొడువైన గూడ్స్‌ రైలు ఇదే.  

Read more