Dasara: విజయదశమి సందర్భంగా మద్యం విక్రయాలపై నిషేధం

ABN , First Publish Date - 2022-10-05T17:06:57+05:30 IST

విజయదశమి సందర్భంగా బుధవారం మద్యం విక్రయాలను(Liquor sale) ప్రభుత్వం నిషేధించింది....

Dasara: విజయదశమి సందర్భంగా మద్యం విక్రయాలపై నిషేధం

బెంగళూరు (కర్ణాటక): విజయదశమి సందర్భంగా బుధవారం మద్యం విక్రయాలను(Liquor sale) ప్రభుత్వం నిషేధించింది.(banned)కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు(Bengaluru) నగరంలో దసరా ఉత్సవాల (Dasara)సందర్భంగా జరుగుతున్న ఊరేగింపులకు అవాంతరం ఏర్పడకుండా ఉండేందుకు వీలుగా బుధవారం మద్యం విక్రయాలపై నిషేధం విధించామని బెంగళూరు పోలీసు కమిషనర్ ప్రతాపరెడ్డి చెప్పారు. బెంగళూరు నగరంలోని మద్యం దుకాణాలు, బార్ లలో బుధవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయించకుండా చర్యలు తీసుకున్నామని పోలీసులు చెప్పారు. స్టార్ హోటళ్లు, క్లబ్ లలో మాత్రం మద్యం విక్రయాలపై నిషేధం లేదని పోలీసులు వివరించారు. నగరంలో బుధవారం జరిగిన పలు దసరా ఊరేగింపుల్లో 60వేలమంది ప్రజలు పాల్గొన్నారు. 

Read more