జయ మేనకోడలు ఆత్మహత్యాయత్నం?

ABN , First Publish Date - 2022-08-31T08:41:29+05:30 IST

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం.

జయ మేనకోడలు ఆత్మహత్యాయత్నం?

భర్త మాధవన్‌తో మనస్పర్థలే కారణం!


చెన్నై, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం. భర్త మాధవన్‌తో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఆమె  ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు విపక్ష అన్నాడీఎంకే వర్గాలు భావిస్తున్నాయి. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. మాధవన్‌తో ఏర్పడిన మనస్పర్థలపై ఆమె ఓ వాట్స్‌పలో తీవ్ర పదజాలంతో మెసేజ్‌ పెట్టినట్టు తెలిసింది. ఈ విషయమై మాధవన్‌ మాట్లాడుతూ.. దీప తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆమెను ఎంతో బాగా చూసుకుంటున్నానని, ఆమెను తానే ఆసుపత్రిలో చేర్పించానని పేర్కొన్నారు. మందులు అధికంగా వాడటం వల్ల ఆమె అస్వస్థతకు గురయ్యారని, వైద్యులు చికిత్స అందిస్తున్నారని వివరించారు.  కాగా, జయ మరణం తర్వాత దీపకు రూ.వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు దక్కాయి. ఆ తరువాతే భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తాయని దీప సన్నిహితులు చెబుతుండడం గమనార్హం. 

Read more