లఖింపురి కేసు: కోర్టు ముందు లొంగిపోయిన నిందితుడు అశిష్ మిశ్రా

ABN , First Publish Date - 2022-04-24T23:07:13+05:30 IST

లఖింపూర్ ఖేరిలో గత అక్టోబర్ 3న ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనకు నిరసగా ఆందోళనకు దిగిన రైతులపై వాహనం నడపడంతో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మృతి చెందారు. బీజేపీ కార్యకర్తలు కూడా ఈ హింసాకాండంలో ప్రాణాలు..

లఖింపురి కేసు: కోర్టు ముందు లొంగిపోయిన నిందితుడు అశిష్ మిశ్రా

లఖ్‌నవూ: లఖింపురి కేసులో ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా ఆదివారం కోర్టు ముందు లొంగిపోయారు. జైలు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. సాయంత్రం 3:25 నిమిషాలకు ఆయన లఖింపురి జిల్లా కోర్టుకు వచ్చి తాను లొంగిపోతున్నట్లు ప్రకటించారు. ఈ కేసులో బెయిల్ కోసం ఆశిష్ పలుమార్లు పెట్టుకున్న అభ్యర్థనలను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంతే కాకుండా ఆయనకి వారం లోపు లొంగిపోవాలంటూ ఆదేశాలు ఇచ్చింది. అయితే కోర్టు ఇచ్చిన గడువుకు ఒక రోజు ముందే ఆశిష్ లొంగిపోయారు. విచారణ సందర్భంగా మిశ్రాకు బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. "హైకోర్టు తన అధికార పరిధిని మించిపోయింది, విచారణలో పాల్గొనే హక్కు బాధితులకు నిరాకరించింది" అని సుప్రీం వ్యాఖ్యానించింది.


లఖింపూర్ ఖేరిలో గత అక్టోబర్ 3న ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనకు నిరసగా ఆందోళనకు దిగిన రైతులపై వాహనం నడపడంతో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మృతి చెందారు. బీజేపీ కార్యకర్తలు కూడా ఈ హింసాకాండంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మూడు ఎస్‌యూవీల డ్రైవర్లతో సహా పలువురుని అరెస్టు చేశారు. వీరంతా ప్రస్తుతం లఖింపూర్ ఖేరి జైలులో ఉన్నారు.

Updated Date - 2022-04-24T23:07:13+05:30 IST