కొడనాడు కేసులో 220 మంది వద్ద విచారణ పూర్తి

ABN , First Publish Date - 2022-04-24T15:33:45+05:30 IST

నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌ లో హత్య, దోపిడీ కేసుకు సంబంధించి 220 మంది వద్ద విచారణ పూర్తిచేసినట్లు ప్రభుత్వ న్యాయవాది షాజహాన్‌ పేర్కొన్నారు. మాజీ

కొడనాడు కేసులో 220 మంది వద్ద విచారణ పూర్తి

ప్యారీస్‌(చెన్నై): నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌ లో హత్య, దోపిడీ కేసుకు సంబంధించి 220 మంది వద్ద విచారణ పూర్తిచేసినట్లు ప్రభుత్వ న్యాయవాది షాజహాన్‌ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో చోటుచేసుకున్న దారుణహత్యలు, దోపిడీలకు సంబంధించిన కేసు విచారణ ఊటీ జిల్లా సెషన్స్‌ కోర్టులో ఇన్‌ఛార్జి న్యాయమూర్తి శ్రీధరన్‌ నేతృత్వంలో కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో జయలలిత స్నేహితురాలు వీకే శశికళ వద్ద విచారణ జరిపేందుకు ఊటీ పోలీసులు నిర్ణయించారు. విచారణకు నేరుగా హాజరుకావాలని ఆమె నోటీసులు జారీ చేసే అవకాశమున్నట్లు న్యాయవాది తెలిపారు.

Read more