శివసేన ఎంపీ Sanjay Rautపై బీజేపీ నేత భార్య పరువునష్టం దావా

ABN , First Publish Date - 2022-05-16T18:09:34+05:30 IST

శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌పై బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య భార్య మేధా ముంబై కోర్టులో పరువునష్టం దావా వేయనున్నారు....

శివసేన ఎంపీ Sanjay Rautపై బీజేపీ నేత భార్య పరువునష్టం దావా

ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌పై బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య భార్య మేధా ముంబై కోర్టులో పరువునష్టం దావా వేయనున్నారు. బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య రూ.100కోట్ల టాయిలెట్ కుంభకోణం చేశారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గత నెలలో ఆరోపించారు. బీజేపీకి చెందిన కిరీట్ సోమయ్య అమిత్ షా పేరును ఉపయోగించి కోట్ల రూపాయలను దోపిడీ చేశాడని సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై తన భార్య ప్రొఫెసర్ డాక్టర్ మేధా కిరీట్ ముంబైలోని సెవ్రీ కోర్టులో కేసు పెట్టనున్నట్లు సోమయ్య ట్వీట్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 499,500 కింద పరువునష్టం కేసు వేయనున్నట్లు సోమయ్య పేర్కొన్నారు.మొత్తంమీద బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ల మధ్య రాజుకున్న వివాదం కాస్తా కోర్టుకెక్కనుంది.


Read more