రాజు చార్లెస్‌.. యువరాజు విలియం!

ABN , First Publish Date - 2022-09-10T08:27:22+05:30 IST

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 మరణంతో రాజ సింహాసనాన్ని ఆమె కుమారుడు 73 ఏళ్ల చార్లెస్‌ దక్కించుకున్నారు. కీలకమైన యువరాజు(ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌)..

రాజు చార్లెస్‌.. యువరాజు విలియం!

మనవలు, మనవరాళ్లకూ కీలక హోదాలు

లండన్‌, సెప్టెంబరు 9: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 మరణంతో రాజ సింహాసనాన్ని ఆమె కుమారుడు 73 ఏళ్ల చార్లెస్‌ దక్కించుకున్నారు. కీలకమైన యువరాజు(ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌) పదవి చార్లెస్‌ పెద్దకుమారుడు విలియం(40)కు దక్కనుంది. అదేవిధంగా చార్లెస్‌ మనవళ్లు, మనవరాళ్లకు కూడా రాచరికపు పదవులు, హోదాలు దక్కనున్నాయి. యువరాజుగా సంప్రదాయ జీవనాన్ని గడపడంతోపాటు సైనిక వ్యవహారాలను విలియం చక్కబెట్టనున్నారు. చార్లెస్‌ మరో కుమారుడు హ్యారీ(37) అమెరికన్‌ మాజీ నటి మేఘన్‌ను వివాహం చేసుకుని అమెరికాలోని లాజ్‌ఏంజెల్‌సకు వెళ్లిపోయారు. రాజుగా పట్టాభిషిక్తుడైన తర్వాత చార్లెస్‌ ఉత్తర ఐర్లాండ్‌కు రాజుగా, కామన్వెల్త్‌ దేశాలకు అధినేతగా, చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌కు సుప్రీం గవర్నర్‌గా వ్యవహరిస్తారు. ఇప్పటి వరకు కేమ్‌బ్రిడ్జి డ్యూక్‌గా ఉన్న విలియం, ఇక నుంచి కార్నవాల్‌కు కూడా డ్యూక్‌గా వ్యవహరించనున్నారు. విలియం సతీమణి కేట్‌ డచెస్‌ ఆఫ్‌ కార్నవాల్‌ అండ్‌ కేమ్‌బ్రిడ్జ్‌ అవుతారు. చార్లెస్‌ రెండో కుమారుడు హ్యారిస్‌ ప్రస్తుతం డ్యూక్‌ ఆఫ్‌ సస్సెక్స్‌గా ఉన్నారు. ఆయన సతీమణి మేఘన్‌ మార్కెల్‌ డచెస్‌ ఆఫ్‌ సస్సెక్స్‌గా ఉన్నారు. వీరి పదవుల్లో ఎలాంటి మార్పు ఉండదు. మరోవైపు.. కింగ్‌ చార్లెస్‌-3 తొలిసారి బకింగ్‌హమ్‌ ప్యాల్‌సలో అడుగుపెట్టారు. స్కాట్‌ల్యాండ్‌ నుంచి శుక్రవారం ఆయన లండన్‌ చేరుకోగా. ప్యాలెస్‌ గేట్ల వద్ద ‘గాడ్‌ సేవ్‌ ది కింగ్‌’ నినాదాలు మిన్నంటాయి.

Updated Date - 2022-09-10T08:27:22+05:30 IST