ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటిద్దాం...

ABN , First Publish Date - 2022-04-28T17:32:49+05:30 IST

ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో అభ్యర్థుల పేర్లను కూడా ముందుగానే ప్రకటించాలన్న ఒత్తిడి పలు రాజకీయ పారీల నేతలపై అధికంగా ఉంది. జేడిఎస్‌ ఇప్పటికే ఈ

ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటిద్దాం...

                      - రాజకీయ పార్టీలపై పెరుగుతున్న ఒత్తిడి


బెంగళూరు: ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో అభ్యర్థుల పేర్లను కూడా ముందుగానే ప్రకటించాలన్న ఒత్తిడి పలు రాజకీయ పారీల నేతలపై అధికంగా ఉంది. జేడిఎస్‌ ఇప్పటికే ఈ దిశలో అడుగు ముందుంది. అనేక నియోజకవర్గాల్లో దళపతులు దేవెగౌడ, కుమారస్వామి అభ్యర్థుల పేర్లను సూచనప్రాయంగా ప్రకటించేశారు. ధిక్కార స్వరం వినిపిస్తున్న ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ ద్వితీయ శ్రేణి పేర్లను కూడా సీరియ్‌సగా పరిశీలిస్తున్నారు. అధికార బీజేపీలో ఇలా ముందస్తు అభ్యర్థుల సమస్య లేనప్పటికీ ఎన్నికల ప్రచారానికి తగిన సమయం లభించకపోవడం వల్లే చాలాచోట్ల గత ఎన్నికల్లో ఓడిపోయామని, ఈసారి ఇలాం టి సమస్య రాకుండా చూడాలని చాలా మంది నేతలు ముందుగానే అధిష్టానం పెద్దలకు విన్నవించుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ లోనూ ముందస్తుగా అభ్యర్థుల పేర్లను ఖరారు చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నగరంలో బుధవారం జరిగిన పార్టీ రాష్ట్ర పదాధికారులు, కార్యవర్గ సభ్యుల సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జిగా ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సుర్జేవాలా దృష్టికి తెచ్చారు. అధిష్టానం పెద్దలతో చర్చించి ఏకాభిప్రాయం ఉన్న నియోజకవర్గాల్లో ముందుగానే అభ్యర్ధుల పేర్లను ప్రకటించేలా చూస్తానని ఆయన భరోసా ఇచ్చారు. 

Read more