Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత పేరు

ABN , First Publish Date - 2022-11-30T20:19:37+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) పేరు ఉందని ఈడీ వెల్లడించింది.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత పేరు

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (delhi liquor scam) రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) పేరును ఈడీ అధికారులు పేర్కొన్నారు. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ఈడీ (ED) అధికారులు బయటపెట్టారు. ABN ఆంధ్రజ్యోతి చేతికి చిక్కిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సౌత్ గ్రూప్ రూ.100 కోట్ల ముడుపులు చెల్లించిందని ఈడీ పేర్కొంది. సౌత్గ్రూప్‌ను శరత్ రెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ పేర్కొంది. సౌత్గ్రూప్ ద్వారా రూ.100 కోట్లను విజయ్నాయర్కు చేర్చినట్లు ఈడీ వెల్లడించింది. దర్యాప్తులో ఇచ్చిన వాంగ్మూలంలో అమిత్ అరోరా ధ్రువీకరించారని ఈడీ రిమాండ్ రిపోర్ట్ పేర్కొంది.

36 మంది రూ.1.38 కోట్ల విలువైన 170 ఫోన్లు ధ్వంసం చేశారని ఈడీ స్పష్టం చేసింది. వీటిలో కవిత రెండు నెంబర్లు, 10 మొబైల్‌ ఫోన్లు వాడినట్లు ఈడీ వెల్లడించింది. కవిత వాడిన 10 ఫోన్ల ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. కవిత ధ్వంసం చేసిన ఫోన్లు, వాటి ఐఎంఈఏ నెంబర్లు, ఫోన్లు మార్చిన తేదీలను రిమాండ్‌ రిపోర్టులో ఈడీ బయటపెట్టింది. ఫోన్లు మార్చిన వారిలో శరత్‌రెడ్డి, బుచ్చిబాబు, అభిషేక్‌ బోయినపల్లి, సృజన్‌రెడ్డి ఉన్నారని ఈడీ తెలిపింది. సృజన్‌రెడ్డి 3, అభిషేక్‌ బోయినపల్లి 5, బుచ్చిబాబు 6, శరత్‌ చంద్రారెడ్డి 9 ఫోన్లు మార్చినట్లు ఈడీ స్పష్టం చేసింది.

Updated Date - 2022-11-30T21:55:39+05:30 IST