మహారాష్ట్రలోకి ప్రవేశించిన జోడో యాత్ర

ABN , First Publish Date - 2022-11-08T02:54:33+05:30 IST

తెలంగాణలో 12 రోజులపాటు సాగిన రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర సోమవారం మహారాష్ట్రలోకి ప్రవేశించింది.

 మహారాష్ట్రలోకి ప్రవేశించిన జోడో యాత్ర

ముంబై: తెలంగాణలో 12 రోజులపాటు సాగిన రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర సోమవారం మహారాష్ట్రలోకి ప్రవేశించింది. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మద్నూర్‌ మండలం సలాబత్‌పూర్‌ వద్ద మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా దెగ్లూర్‌లోకి యాత్ర ప్రవేశించింది. జోడో యాత్రలో భాగంగా ఈ నెల 10న నాందేడ్‌ జిల్లాలో, 18న బుల్దానా జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మహారాష్ట్రలో మొత్తం 14 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది.

Updated Date - 2022-11-08T02:54:33+05:30 IST

Read more