జేఎంఎం బ్లాక్ ప్రెసిడెంట్‌ను కాల్చిచంపిన అగంతకులు

ABN , First Publish Date - 2022-04-24T20:44:25+05:30 IST

జార్ఖాండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) బ్లాక్ ప్రెసిడెంట్‌ దిలేశ్వర్ ఖాన్‌ను గుర్తుతెలియని దుండగులు..

జేఎంఎం బ్లాక్ ప్రెసిడెంట్‌ను కాల్చిచంపిన అగంతకులు

లతెహార్: జార్ఖాండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) బ్లాక్ ప్రెసిడెంట్‌ దిలేశ్వర్ ఖాన్‌ను గుర్తుతెలియని దుండగులు ఆదివారం ఉదయం కాల్చిచంపారు. లతెహార్ జిల్లాలో ని కుసుమహి రైల్వే సైడింగ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. జేఎంఎం బాలూమాథ్ బ్లాక్ ప్రెసిడెంట్‌గా దిలేశ్వర్ ఖాన్ ఉన్నారు. 


పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు రెండు మోటారు సైకిళ్లపై వచ్చి రైల్వే సెండింగ్ వద్ద ఖాన్‌పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను లతెహార్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. దుండగుల కోసం గాలిస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా వారిని పట్టుకుంటామని బాలూమాథ్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి అజిత్ కుమార్ తెలిపారు. కాగా, సమాచారం తెలిసిన వెంటనే జేఎంఎం లతెహార్ ఎమ్మెల్యే బైద్యనాథ్ రామ్ హుటాహుటిన తన సహచరులతో కలిసి సదర్ ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసుల  బాధ్యతారాహిత్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన ఆరోపించారు. ఆగ్రహించిన గ్రామస్థులు రాంచీ-ఛాత్ర రోడ్డును దిగ్బంధం చేశారు. దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Read more