పొగాకు వినియోగాన్ని తగ్గించిన Jharkhandకు WHO అవార్డు

ABN , First Publish Date - 2022-05-29T23:36:09+05:30 IST

ఇది జార్ఖండ్ సాధించిన గొప్ప విజయం. రాష్ట్రంలో పొగాకు నియంత్రణ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి రాజకీయ, కార్యనిర్వాహక వర్గాల మద్దతు చాలా ఉపయోగపడింది’’ అని పాఠక్ అన్నారు. ఎన్‌టీసీపీ సహకారంతో 2012లో..

పొగాకు వినియోగాన్ని తగ్గించిన Jharkhandకు WHO అవార్డు

రాంచీ: పొగాకు వినియోగాన్ని తగ్గించినందుకుగాను జార్ఖండ్(Jharkhand) రాష్ట్రానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organization) అందించే అవార్డు లభించింది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది ప్రపంచ పొగాకు రహిత దినం అవార్డు -2022ను WHO అందించనుంది. అయితే జార్ఖ్ండ్‌లో తీసుకున్న చర్యల వల్ల పొగాకు వినియోగం తగ్గిందని అందుకే ఈ అవార్డు లభించిందని అందుకే ఈ అవార్డు లభించినట్లు జార్ఖండ్ రాష్ట్ర పొగాకు నియంత్రణ కార్యక్రమ నోడల్ అధికారి లలిత్ రంజన్ పాఠక్ ఆదివారం పేర్కొన్నారు. ఈ అవార్డును ఈ నెల 31న ఢిల్లీలో జార్ఖండ్ ఆరోగ్య శాఖ విభాగమైన పొగారు నియంత్రణ సెల్‌కు అందించనున్నట్లు తెలిపారు.


‘‘ఇది జార్ఖండ్ సాధించిన గొప్ప విజయం. రాష్ట్రంలో పొగాకు నియంత్రణ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి రాజకీయ, కార్యనిర్వాహక వర్గాల మద్దతు చాలా ఉపయోగపడింది’’ అని పాఠక్ అన్నారు. ఎన్‌టీసీపీ సహకారంతో 2012లో జార్ఖండ్‌లో పొగాకు నియంత్రణ కార్యక్రమం చేపట్టారు. ఈ చర్యల కారణంగా 51.1శాతంగా ఉన్న పొగాకు వినియోగం 2018 నాటికి 38.9కి తగ్గిందని గ్లోబల్ అడల్ట్ టుబాకో సర్వే పేర్కొంది.

Read more