muddy street: నేషనల్ హైవే మరమ్మతుల కోసం మహిళా ఎమ్మెల్యే వినూత్న నిరసన...బురదనీటిలో స్నానం

ABN , First Publish Date - 2022-09-21T17:37:38+05:30 IST

జాతీయ రహదారికి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ జార్ఖండ్(Jharkhand MLA) రాష్ట్రానికి చెందిన ఓ మహిళా శాసనసభ్యురాలు బుధవారం వినూత్న నిరసన....

muddy street: నేషనల్ హైవే మరమ్మతుల కోసం మహిళా ఎమ్మెల్యే వినూత్న నిరసన...బురదనీటిలో స్నానం

రాంచీ (జార్ఖండ్): జాతీయ రహదారికి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ జార్ఖండ్(Jharkhand MLA) రాష్ట్రానికి చెందిన ఓ మహిళా శాసనసభ్యురాలు బుధవారం వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. 133 వ నంబరు జాతీయ రహదారికి మరమ్మతులు(repair) చేపట్టాలని జార్ఖండ్ రాష్ట్రంలోని గొడ్డా మహిళా ఎమ్మెల్యే దీపికాపాండే సింగ్( (Deepika Pandey Singh)  పలు సార్లు జాతీయ రహదారుల విభాగం అధికారులకు విన్నవించారు. నేషనల్ హైవే( National Highway 133) అధ్వానంగా మారడంతోపాటు వర్షం కురిస్తే చాలు బురదనీరు రోడ్డుపైనే నిలుస్తోంది. రోడ్డుకు మరమ్మతులు చేపట్టక పోవడం వల్ల ప్రతీరోజూ ఈ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.


 అయినా కేంద్ర నేషనల్ హైవే విభాగం అధికారులు పట్టించుకోక పోవడంతో బుధవారం ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ బురదనీటిలో దిగి స్నానమాచరించి నిరసన తెలిపారు.(sat down on a muddy road and bathed) జాతీయ రహదారికి మరమ్మతు పనులు చేపట్టేవరకూ తాను బురదనీటిలో నుంచి బయటకు రానని ఎమ్మెల్యే దీపికా బీష్మించుకు కూర్చున్నారు. బురదనీటిలో మహిళా ఎమ్మెల్యే వినూత్న నిరసనతో ప్రజలు, అధికారులు తరలివచ్చారు.


Updated Date - 2022-09-21T17:37:38+05:30 IST