కిలో మల్లెపూలు రూ.4,500

ABN , First Publish Date - 2022-09-08T15:35:04+05:30 IST

కన్నియాకుమారి(Kanniyakumari) పూల మార్కెట్‌లో మల్లెపూలు కిలో రూ.4,500లు పలికాయి. ఓనం పండుగను రాష్ట్రంలోని మలయాళీయులతో

కిలో మల్లెపూలు రూ.4,500

పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 7: కన్నియాకుమారి(Kanniyakumari) పూల మార్కెట్‌లో మల్లెపూలు కిలో రూ.4,500లు పలికాయి. ఓనం పండుగను రాష్ట్రంలోని మలయాళీయులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఉత్సాహంగా జరుపుకుంటారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఓనం పండుగ కళ తప్పింది. ప్రస్తుతం కరోనా నియంత్రణలోకి రావడంతో ఈ ఏడాది కోలాహలంగా జరుపుకొనేందుకు అటు కేరళ(Kerala), ఇటు రాష్ట్రం ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో, కన్నియాకుమారి పూల మార్కెట్‌లో ప్రతిరోజు సుమారు 50 టన్నుల పూలు విక్రయమవుతుండగా, ప్రస్తుతం ఓనం పండుగ సందర్భంగా 300 టన్నులు అమ్ముడుపోతున్నాయి. పూల గిరాకీ పెరగడంతో 10 రోజుల క్రితం మల్లె కిలో రూ.300 ఉండగా, బుధవారం రూ.4.5వేలు పలికింది. అలాగే, చామంతులు కిలో రూ.80 నుంచి రూ.250, ఆరణి పూలు రూ.200 నుంచి రూ.600, వడ మల్లి రూ.50 నుంచి రూ.300 ఇలా అన్నిరకాల పూల ధరలు పెరిగాయి.

Read more