ఇక జన ఔషధి కేంద్రాల్లో ‘సిటాగ్లిప్తిన్‌’

ABN , First Publish Date - 2022-09-17T08:41:52+05:30 IST

మధుమేహానికి వినియోగించే సిటాగ్లిప్తిన్‌ ఔషధాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం దేశవ్యాప్తంగా జన ఔషధి కేంద్రాల్లో

ఇక జన ఔషధి కేంద్రాల్లో ‘సిటాగ్లిప్తిన్‌’

న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: మధుమేహానికి వినియోగించే సిటాగ్లిప్తిన్‌ ఔషధాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం దేశవ్యాప్తంగా జన ఔషధి కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చింది. 10 మాత్రల స్ర్టిప్‌ రూ.60కి లభిస్తుందని తెలిపింది. సిటాగ్లిప్తిన్‌, మెట్‌ఫార్మిన్‌ హైడ్రోక్లోరైడ్‌ ఔషధాలను కలిపిన 10 గోలీల 500 ఎంజీ ప్యాకెట్‌ రూ.65కు, 1000 ఎంజీ ప్యాకెట్‌ రూ.70కు లభిస్తుందని వివరించింది. పది సిటాగ్లిప్తిన్‌ ఫోస్ఫేట్‌ 50 ఎంజీ గోలీలు రూ.60కు, 100 ఎంజీ గోలీలు రూ.100కు లభ్యమవుతాయని చెప్పింది. ఇతర బ్రాండ్‌లకు చెందిన వేరియెంట్లతో పోలిస్తే ఈ ఔషధాల ధరలు 60శాతం నుంచి 70శాతం మేర తక్కువగా ఉంటాయని వెల్లడించింది.

Read more