punjabలో ఆప్ విజయోత్సాహం...సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ఇంట్లో జిలేబీల తయారీ

ABN , First Publish Date - 2022-03-10T14:35:35+05:30 IST

పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్టీ 40 స్థానాల్లో ముందంజలో ఉండటంతో ఆ పార్టీ నేతలు విజయోత్సాహంలో మునిగారు....

punjabలో ఆప్ విజయోత్సాహం...సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ఇంట్లో జిలేబీల తయారీ

సంగ్రూర్: పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్టీ 54 స్థానాల్లో ముందంజలో ఉండటంతో ఆ పార్టీ నేతలు విజయోత్సాహంలో మునిగారు. ఆప్ పార్టీ విజయపథాన పయనిస్తూ ప్రభుత్వాన్ని నెలకొల్పనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్ ముఖ్యమంత్రిగా భావిస్తున్న భగవంత్ మాన్ గురువారం తెల్లవారుజామున గురుద్వారాలో ప్రార్థనలు చేశారు. ఆప్ అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉండటంతో భగవంత్ మాన్ తన ఇంట్లో విజయోత్సవ వేడుకకు సన్నాహాలు చేశారు.ఆప్ విజయం కోసం సంగ్రూర్‌లోని భగవంత్ మాన్ ఇంట్లో జిలేబీలు వండించారు.సంగ్రూర్‌లోని గురుద్వారా గురుసాగర్ మస్తువానా సాహిబ్‌లో భగవంత్ మాన్ ప్రార్థనలు చేశారు.



తాను సీఎంగా ఉన్నత పదవి పొందినా సాధారణ వ్యక్తిగానే ఉంటానని భగవంత్ మాన్ చెప్పారు.కమేడియన్ అయిన మాన్ రాజకీయాల్లోకి వచ్చి ఆప్ సీఎం అభ్యర్థి అయ్యారు.తాను సీఎం అయితే ప్రజల మధ్యకకు వెళ్లి వారితో కలిసి పనిచేస్తానని మాన్ చెప్పారు.

Updated Date - 2022-03-10T14:35:35+05:30 IST