జగన్‌ ఉండగా.. రాష్ర్టానికి రాలేనేమో!

ABN , First Publish Date - 2022-07-05T07:58:17+05:30 IST

ఉన్మాది జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండ గా తాను ఏపీకి వస్తానని అనుకోవడం లేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

జగన్‌ ఉండగా.. రాష్ర్టానికి రాలేనేమో!

ఎంపీ రఘురామకృష్ణంరాజు వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 4(ఆంధ్రజ్యోతి) ఉన్మాది జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండ గా తాను ఏపీకి వస్తానని అనుకోవడం లేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఎన్నికల కోడ్‌ వచ్చి, పోలీసులు సీఎం అదుపు ఆజ్ఞల్లో లేనప్పుడే తాను రాష్ట్రంలో అడుగుపెట్టగలనని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తాను  పాల్గొనకపోవడానికి కారణాన్ని ఆయన వివరించారు. ఆహ్వానితుల జాబితాలో స్థానిక ఎంపీగా తన పేరు లేకపోవడంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. తనను అభిమానించి, ప్రేమించే ఎంతోమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Read more