Instagram Dual: కొత్త రీల్స్ ఫార్మేట్ గురించి...

ABN , First Publish Date - 2022-07-24T19:28:56+05:30 IST

ఇన్‌స్టాగ్రామ్ (Instagram) భారీ మార్పులు చేసింది. యూజర్లకు మరింత

Instagram Dual: కొత్త రీల్స్ ఫార్మేట్ గురించి...

న్యూఢిల్లీ : ఇన్‌స్టాగ్రామ్ (Instagram) భారీ మార్పులు చేసింది. యూజర్లకు మరింత చేరువయ్యేందుకు డ్యూయల్, టెంప్లేట్స్‌ను రీల్స్‌కు జత చేసింది. రీల్స్‌ను కొలాబరేట్, క్రియేట్, షేర్ చేయడం మరింత సులువుగా, సరదాగా ఉండే విధంగా ఈ మార్పులు జరిగినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. రీల్స్ వీడియో మెర్జ్, రీల్స్ టెంప్లేట్స్, రీమిక్స్ ఇంప్రూవ్‌మెంట్స్, డ్యూయల్ కెమెరా ఫీచర్లను చేర్చినట్లు తెలిపింది. 15 నిమిషాల వరకు నిడివిగల వీడియోలు డిఫాల్ట్‌గా రీల్స్‌ అవుతాయని పేర్కొంది.


ఇన్‌స్టాగ్రామ్ డ్యూయల్ రీల్స్

యూజర్ తన ఫోన్‌లోని రియర్ కెమెరాను ఉపయోగించి రికార్డు చేస్తూనే, దానిపై తన స్పందనను దానిలోని ఫ్రంట్ కెమెరాతో చిత్రీకరించడానికి డ్యూయల్ ఆప్షన్ అవకాశం కల్పిస్తుంది. ఈ విధంగా చిత్రీకరించినపుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్ వస్తుంది. రియర్ కెమెరాతో చిత్రీకరించిన వీడియో మొత్తం స్క్రీన్‌లో అత్యధిక భాగాన్ని ఆక్రమించి, ఆ మెయిన్ వీడియోకు యూజర్ రియాక్షన్‌ను చిన్న విండోలో చూపిస్తుంది. ఈ డ్యూయల్ ఫీచర్‌ను ఉపయోగించుకోవడం ఎలా అంటే...


- ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్ చేయాలి.

- స్క్రీన్ పైభాగంలో కుడివైపునగల ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయాలి.

- Reel ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. 

- అనంతరం వచ్చే స్క్రీన్‌పై ఎడమవైపున కొన్ని ఆప్షన్ల జాబితా వస్తుంది.

- డౌన్ యారోను సెలెక్ట్ చేసుకుని అన్ని ఆప్షన్లు కనిపించేలా చేసుకోవచ్చు.

- Dual లేబుల్ ఉన్న కెమెరా ఐకాన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.

- Record ఐకాన్‌ను ట్యాప్ చేయాలి. వీడియోను రికార్డు చేయాలి. 

- వీడియో రికార్డింగ్ పూర్తయిన తర్వాత ఎఫెక్ట్స్, మ్యూజిక్, ఇతర ఎఫెక్ట్స్‌ను జత చేయవచ్చు. 


ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ టెంప్లేట్  (Instagram Reels Template)

ఇతర క్రియేటర్లు క్రియేట్ చేసిన రీల్స్ ఆధారంగా రీల్స్‌ను క్రియేట్ చేయడానికి యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్ అవకాశం కల్పిస్తుంది. రీల్‌ను చూసేటపుడు స్క్రీన్ పైభాగంలో కుడివైపున ఉండే కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు యూజర్ తన సొంత ఇమేజెస్, వీడియోస్‌ను యాడ్ చేయవచ్చు. యూజర్ సెలెక్ట్ చేసుకున్న రీల్ ఆధారంగా ప్లేస్‌హోల్డర్ క్లిప్స్, ప్రీ-లోడెడ్ మ్యూజిక్‌తో రీల్‌కు సొంత ఇమేజెస్, వీడియోస్ యాడ్ చేయవచ్చు. 


రీల్స్ డిఫాల్ట్ వీడియో ఫార్మేట్ (Reels default video format)

రానున్న కొద్ది వారాల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసే 15 నిమిషాల కన్నా తక్కువ నిడివిగల వీడియోలన్నీ ఆటోమేటిక్‌గా రీల్స్ అయిపోతాయి. ఈ వేదికపైన రీల్స్‌ను డిఫాల్ట్ వీడియో ఫార్మేట్‌గా ఇన్‌స్టాగ్రామ్ చేయబోతోంది. రీల్స్, వీడియోస్ ట్యాబ్‌ను ఒకే ట్యాబ్‌గా మార్చుతుంది. అయితే గతంలో అప్‌లోడ్ చేసిన వీడియోలకు ఈ మార్పులు వర్తించవు. 


Updated Date - 2022-07-24T19:28:56+05:30 IST