ఏడు దేశాల్లో భారత ఐఐటీ క్యాంపస్‌లు!

ABN , First Publish Date - 2022-08-25T09:53:36+05:30 IST

భారత్‌లోని ఐఐటీలను ప్రపంచవ్యాప్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఏడు దేశాల్లో భారత  ఐఐటీ క్యాంపస్‌లు!

న్యూఢిల్లీ, ఆగస్టు 24: భారత్‌లోని ఐఐటీలను ప్రపంచవ్యాప్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మన ఐఐటీలకు వివిధ దేశాల్లో క్యాంప్‌సలు తెరవాలని భావిస్తోంది. ఇందుకోసం 17 మంది సభ్యులతో ఒక కమిటీని నియమించింది. విదేశాల్లో తెరిచే క్యాంప్‌సలకు ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీగా పేరుపెట్టి.. అందులో వివిధ దేశాల విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించే గ్లోబల్‌ క్యాంప్‌సలుగా మార్చనున్నారు. ఏ దేశాల్లో క్యాంప్‌సలు ఏర్పాటు చేయాలి, నిధుల సమీకరణ ఎలా అన్నదానిపై కమిటీ పరిశీలించనుంది.


Read more