IND vs SA: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. టీమిండియా ఈ మ్యాచ్‌లో అయినా..

ABN , First Publish Date - 2022-06-13T00:40:36+05:30 IST

ఐటీ టీ20ల సిరీస్‌లో భాగంగా కటక్ వేదికగా దక్షిణాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి..

IND vs SA: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. టీమిండియా ఈ మ్యాచ్‌లో అయినా..

కటక్: ఐటీ టీ20ల సిరీస్‌లో భాగంగా కటక్ వేదికగా దక్షిణాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి టీ20 మ్యాచ్‌లో కూడా టాస్ గెలిచిన సఫారీ జట్టు బౌలింగ్ ఎంచుకుని టీమిండియా పెట్టిన భారీ టార్గెట్‌ను కూడా సునాయాసంగా ఛేజ్ చేసింది. మిల్లర్, డుస్సెన్ బాదుడుతో విక్టరీ సాధించి 1-0తో సిరీస్‌లోనూ ముందంజలో ఉంది. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌ పరంగా లోపాలేమీ కనిపించలేదు. ప్రతీ బ్యాటర్‌ మెరుగ్గానే రాణించడంతో ఈ ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాపై తమ అత్యధిక స్కోరును నమోదు చేయగలిగింది. కానీ బౌలింగే పూర్తిగా గతి తప్పింది. హర్షల్‌, చాహల్‌, అక్షర్‌, భువీ, అవేశ్‌ ఇలా అందరినీ మిల్లర్‌, డుస్సెన్‌ ఆటాడుకున్నారు. నేటి మ్యాచ్‌లో బౌలర్లు మిల్లర్‌ను ఎలా అడ్డుకోగలరనే దానిపైనే విజయావకాశాలుంటాయి.


టీమిండియా: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), హార్థిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్సర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, చాహల్, అవీష్ ఖాన్


సౌతాఫ్రికా: బవూమ (కెప్టెన్), హెండ్రిక్స్, డుస్సెన్, మిల్లర్, క్లస్సేన్ (వికెట్ కీపర్), ప్రిటోరియస్, పర్నెల్, షంశీ, రబడ, నోర్త్జే, కేశవ్ మహరాజ్

Updated Date - 2022-06-13T00:40:36+05:30 IST