తాళి కట్టే శుభవేళలో...ప్రియుడి దుస్సాహసం!

ABN , First Publish Date - 2022-09-10T08:45:11+05:30 IST

పెళ్లి జరుగుతోంది...మాంగల్య ధారణ సమయం వచ్చింది...వరుడు తాళి తీసుకుని వధువు మెడలో కట్టబోతుండగా హఠాత్తుగా అక్కడకు..

తాళి కట్టే శుభవేళలో...ప్రియుడి దుస్సాహసం!

వరుడి చేతిలో తాళి లాక్కొని 

వధువు మెడలో కట్టబోయిన వైనం

 దేహశుద్ధి చేసిన బంధువులు

చెన్నై, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పెళ్లి జరుగుతోంది...మాంగల్య ధారణ సమయం వచ్చింది...వరుడు తాళి తీసుకుని వధువు మెడలో కట్టబోతుండగా హఠాత్తుగా అక్కడకు వచ్చిన యువకుడు మంగళసూత్రం లాక్కొని వధువు మెడలో కట్టడానికి ప్రయత్నించాడు. ఆఖరుక్షణంలో గ్రహించిన వధువు బంధువులు ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టించారు. చెన్నైలో  ఈ సంఘట న జరిగింది. స్థానిక తండయార్‌పేటకు చెందిన సుమతి (20), రాజ్‌ (21)ల వివాహం నేతాజీనగర్‌లోని మురుగన్‌ ఆలయంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు జరగాల్సివుంది. ముహూర్త సమయంలో రాజ్‌ సుమతికి మాంగల్యధారణ చేసేందుకు సిద్ధమయ్యాడు.


ఇంతలో అక్కడికి వచ్చి న సుందరేశ్‌ (25) అనే యువకుడు ఆ తాళి లాక్కొని తనే వధువు మెడలో  కట్టబోయాడు. దీనిని అడ్డుకున్న వధువు బంధువులు అతనిని చితగ్గొట్టి పోలీసులకు అప్పగించారు. అయితే ఈ సందర్భంగా పలు కొత్త విషయాలు బయల్పడ్డాయి. ఒకేనగల దుకాణంలో పనిచేస్తున్న సుమతి, సుందరేశ్‌ చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయా న్ని సుమతి ఇంట్లోవారికి చెప్పలేదు. తల్లిదండ్రులు చూసిన  పెళ్లికి సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న సుందరేశ్‌ దుస్సాహసానికి దిగాడు. ఈ విషయాలన్నీ బయటకు పొ క్కడంతో రాజ్‌ వధువు మె డలో తాళి కట్టేందుకు నిరాకరించాడు. కాగా సుందరేశ్‌తోనే సుమతి వివాహం జరిపించేలా ఇరు కుటుంబాలతో పోలీసులు మాట్లాడుతున్నారు. 

Read more