రుగ్వేదంలో మాంసాహారంపై వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-09-10T08:42:24+05:30 IST

జమ్మూ కశ్మీర్‌లో ఓ సీనియర్‌ అధికారి చేసిన వ్యాఖ్యలు అతని సస్పెన్షన్‌కు దారితీశాయి.

రుగ్వేదంలో   మాంసాహారంపై వ్యాఖ్యలు

జమ్మూలో ఓ సీనియర్‌ అధికారి సస్పెన్షన్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: జమ్మూ కశ్మీర్‌లో ఓ సీనియర్‌ అధికారి చేసిన వ్యాఖ్యలు అతని సస్పెన్షన్‌కు దారితీశాయి. ‘రుగ్వేదం మాంసాహారం భుజించడాన్ని అంగీకరించింది’ అంటూ సదరు అధికారి చేసిన వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నందున వెంటనే చర్యలు తీసుకున్నట్లు పాలనాయంత్రాంగం పేర్కొంది. గత మంగళవారం రాత్రి ‘ఒక మతంపై అసిస్టెంట్‌ కమిషనర్‌ (పంచాయత్‌) అబ్దుల్‌ రషీద్‌ కోహ్లి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయి. ఆయనను సస్పెండ్‌ చేస్తున్నాం’’ అని రజౌరీ జిల్లా కలెక్టర్‌ వికాస్‌ కుందల్‌ పేర్కొన్నారు. కోహ్లి కింద పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. 

Read more