యూపీలో ఉమ్మడి పౌర స్మృతి అమలు: కేశవ్‌

ABN , First Publish Date - 2022-04-24T08:10:56+05:30 IST

దేశంలో అందరికీ ఒకే చట్టం తక్షణావసరం అని ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య అన్నారు.

యూపీలో ఉమ్మడి పౌర స్మృతి అమలు: కేశవ్‌

లఖ్‌నవూ, ఏప్రిల్‌ 23: దేశంలో అందరికీ ఒకే చట్టం తక్షణావసరం అని ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య అన్నారు. ఈ నేపథ్యంలో యూపీలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలు చేస్తామని, ఈ దిశగా తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆయన తెలిపారు. శనివారం ఇక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌ కోసం యూసీసీ కీలకమని, అందరూ యూసీసీని స్వాగతించాలని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లోనూ యూసీసీని అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Read more