ఆటోలో అక్రమంగా 20 కిలోల బంగారం తరలింపు

ABN , First Publish Date - 2022-09-11T09:10:10+05:30 IST

ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల బంగారాన్ని ఎగ్మూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆటోలో అక్రమంగా 20 కిలోల బంగారం తరలింపు

స్వాధీనం చేసుకున్న చెన్నై పోలీసులు.. ఇద్దరి అరెస్టు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల బంగారాన్ని ఎగ్మూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎగ్మూర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఓ ఆటోలో ఉన్న సంచిని పోలీసులు సోదా చేసి అందులో బంగారం ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఆ బంగారానికి సంబంధించిన పత్రాలేవీ చూపకపోవడంతో ఆటోలో ఉన్న ఇద్దరిని అరెస్టు చేశారు. వారిద్దరూ రాజస్థాన్‌కు చెందిన రాహుల్‌, భరత్‌వాలా అని విచారణలో గుర్తించారు. 

Read more