IIT Madras: డేటాసైన్స్, అప్లికేషన్స్‌లో నాలుగేళ్ల బీఎస్ డిగ్రీ.. ఆఫర్ చేస్తున్న మద్రాస్ ఐఐటీ.. దరఖాస్తు ఇలా చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-08-02T01:32:03+05:30 IST

డేటాసైన్స్‌, అప్లికేషన్స్‌లో నాలుగేళ్ల బీఎస్ డిగ్రీ అందుబాటులోకి వచ్చింది. బీఎస్సీ ఇన్ ప్రోగ్రామింగ్, డేటా సైన్స్‌కు దేశవ్యాప్తంగా

IIT Madras: డేటాసైన్స్, అప్లికేషన్స్‌లో నాలుగేళ్ల బీఎస్ డిగ్రీ.. ఆఫర్ చేస్తున్న మద్రాస్ ఐఐటీ.. దరఖాస్తు ఇలా చేసుకోవాలి

చెన్నై: డేటాసైన్స్‌, అప్లికేషన్స్‌లో నాలుగేళ్ల బీఎస్ డిగ్రీ అందుబాటులోకి వచ్చింది. బీఎస్సీ ఇన్ ప్రోగ్రామింగ్, డేటా సైన్స్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ (IIT Madras) ఈ నాలుగేళ్ల కోర్సును ప్రకటించింది. ఈ స్థాయిలో భాగంగా విద్యార్థులు 8 నెలల అప్రెంటీస్‌షిప్ లేదంటే కంపెనీలు లేదంటే పరిశోధనా సంస్థలతో ప్రాజెక్ట్ చేయవచ్చు. 12వ తరగతిలో ఉన్న విద్యార్థులు కూడా ఈ ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశాలు పొందినవారు 12వ తరగతిని పూర్తి చేసిన తర్వాత ప్రోగ్రాంను ప్రారంభిస్తారు. ఏ స్ట్రీమ్‌కు చెందిన విద్యార్థులైనా నమోదు చేసుకోవచ్చు. వయసు పరిమితి లేదు. 10వ తరగతిలో ఇంగ్లిష్, గణితం చదివిన ఎవరైనా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. తరగతులు ఆన్‌లైన్ లో నిర్వహిస్తారు కాబట్టి ప్రాంతాలతో సంబంధం లేదు. 


ప్రస్తుతం 13 వేలమందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. తమిళనాడు నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు నమోదు చేసుకోగా తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ ఉన్నాయి. భారతదేశంలో 111 పట్టణాలలో వ్యక్తిగత పరీక్షలు (ఇన్-పర్సన్ పరీక్షలు) 116 పరీక్షా కేంద్రాలలో నిర్వహించారు. పరీక్షా కేంద్రాలను యూఏఈ, బహ్రైన్, కువైట్, శ్రీలంకలోనూ తెరిచారు. 2022 సెప్టెంబర్ టెర్మ్ కోసం ఈ డేటా సైన్స్ ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ 19 ఆగస్ట్ 2022. ఆసక్తి గల విద్యార్థులు వెబ్‌సైట్ - https://onlinedegree.iitm.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated Date - 2022-08-02T01:32:03+05:30 IST