UP: డబ్బుల కోసం ఏటిఎంకు వెళ్తే..

ABN , First Publish Date - 2022-12-10T12:58:22+05:30 IST

మారుతున్న టెక్నాలజీ (Technology)కి అనుగుణంగా కొందరు నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులకు దొరక్కుండా వినూత్నంగా దోపిడీలు చేస్తున్నారు.

UP: డబ్బుల కోసం ఏటిఎంకు వెళ్తే..

ఉత్తరప్రదేశ్: మారుతున్న టెక్నాలజీ (Technology)కి అనుగుణంగా కొందరు నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులకు దొరక్కుండా వినూత్నంగా దోపిడీలు చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఏటీఎం (ATM)కు వెళ్లి డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించగా మిషన్‌లోనే కార్డు ఇరుక్కుపోయింది. ఆ కొద్ది క్షణాల్లోనే ఆ వ్యక్తి అకౌంట్లో నగదు మొత్తం మాయమైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో జరిగింది. యూపీలో ఆరుగురు ముఠా సభ్యులు ఏటీఎం సెంటర్లను టార్గెట్ చేస్తారు. ఎవరైనా ఏటీఎంకు వస్తున్నారని గమనించగానే ముఠా సభ్యులు ఏటీఎం కార్డు ఇన్‌షర్టు చేసే ప్రాంతంలో ఫెవిక్విక్‌ను రాసి వెళ్లిపోతారు.

ఏటీఎంకు వచ్చి.. కార్డుతో డబ్బులు డ్రా చేయాలని వచ్చిన వ్యక్తి కార్డు అందులో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్నప్పుడు.. ముఠా సభ్యుడు లోపలకు వచ్చి కార్డు సరిగా పెట్టారా? పిన్ కోడ్ సరిగా కొట్టారా? వంటి ప్రశ్నలు వేసి.. కార్డు గురించి వివరాలు రాబడతారు. తర్వాత సర్వీస్ నెంబర్ అంటూ ఓ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళతారు. ఆ తర్వాత కార్డు దారుడు సర్వీస్ సెంటర్‌కు ఫోన్ చేయగా.. కొంచెం ఆలస్యం అవుతుందని, వచ్చే ముందు కాల్ చేస్తామని చెబుతారు. దీంతో కార్డు దారుడు అక్కడి నుంచి వెళ్లిపోగానే పక్కనే దాక్కున్న ముఠా సభ్యులు బయటకు వచ్చి సర్జికల్ డేట్ సాయంతో ఏటీఎం కార్డును బయటకు తీసి వేరే ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తారు. తాజాగా ఈ ముఠా ఉచ్చులో చిక్కున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 48 ఏటీఎం కార్డులు, రూ. 75వేల నగదు, 65 సిమ్ కార్డులు, రెండు లైసన్స్ లేని తుపాకులు, ఆరు సెల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎం సెంటర్లకు వెళ్లేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

Updated Date - 2022-12-10T12:58:25+05:30 IST