Supreme court: వీధి కుక్కలు కరిస్తే వాటికి ఆహారం అందించేవారే బాధ్యులు

ABN , First Publish Date - 2022-09-10T23:54:15+05:30 IST

వీధి కుక్కలు (Stray dogs) రొటీన్‌గా ఆహారం అందించే వారే ఇకపై ఆ కుక్కలు ఎవరినైనా కరిస్తే బాధ్యత..

Supreme court: వీధి కుక్కలు కరిస్తే వాటికి ఆహారం అందించేవారే బాధ్యులు

న్యూఢిల్లీ: వీధి కుక్కలకు (Stray dogs) రొటీన్‌గా ఆహారం అందించే వారే ఇకపై ఆ కుక్కలు ఎవరినైనా కరిస్తే బాధ్యత తీసుకోవాలని సుప్రీంకోర్టు (Supreme court) సూచించింది. వాటికి వ్యాక్సినేషన్ (vaccination) కూడా చేయించాలని ఆదేశించింది. వీధికుక్కల బెడదకు ఒక పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేసింది.


కేరళలో వీధికుక్కల బెడత తీవ్రంగా ఉందన్న పిటిషనన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. చాలామందికి కుక్కలంటే  ప్రేమ ఉంటుందని, తాను కూడా డాగ్ లవరేనని జస్టిస్ ఖన్నా అన్నారు. వీధి కుక్కలకు ఆహారం పెట్టే వారు (డాగ్ లవర్స్) కుక్కల వ్యాక్సినేషన్‌  బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. కుక్కలకు స్పెషల్‌గా మార్క్ చేయడమో, నెంబర్లు వేయడమో చేయాలని అన్నారు. అవి ఎవరినైనా కరిస్తే వాటికి అయ్యే ఖర్చులకు బాధ్యత తీసుకోవాలన్నారు. సహజంగా వీధి కుక్కలు ఆహారం దొరకనప్పుడు, ఏదైనా జబ్బు సోకినప్పుడు క్రూరంగా ప్రవరిస్తూ దాడులు చేస్తు్ంటాయని ఆయన చెప్పారు. వీధి కుక్కలను సంరక్షించడం ఎంత అవసరమో అమాయక ప్రజలు వాటిని బారిన పడకుండా చూడటం కూడా అంతే అవసరమని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్లపై వాదోపవాదనలను విన్న అత్యున్నత న్యాయస్థానం ఈ కేసులో తమ వాదనలను వినిపించేందుకు జంతు హక్కుల సంరక్షణ సంస్థలకు అనుమతి ఇస్తూ, తదుపరి విచారణను సెప్టెంబర్ 28వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - 2022-09-10T23:54:15+05:30 IST