కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో బుకారెస్ట్ మేయర్ వాగ్వివాదం.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-03-05T00:31:21+05:30 IST

ఉక్రెయిన్‌లోకి చిక్కుకుపోయి అక్కడి నుంచి రొమేనియాకు చేరుకున్న భారతీయ విద్యార్థుల తరలింపు

కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో బుకారెస్ట్ మేయర్ వాగ్వివాదం.. వీడియో వైరల్

బుకారెస్ట్: ఉక్రెయిన్‌లోకి చిక్కుకుపోయి అక్కడి నుంచి రొమేనియాకు చేరుకున్న భారతీయ విద్యార్థుల తరలింపు చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు వెళ్లిన భారత పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు, బకారెస్ట్ మేయర్‌కు మధ్య జరిగిన వాగ్వివాదం జరిగింది.


ఈ నెల 2న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం రొమేనియాలో ఉన్న మంత్రి సింధియా భారతీయ విద్యార్థుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. 


బుకారెస్ట్‌లోని ఓ శరణార్థి శిబిరంలో ఉన్న విద్యార్థులను ఉద్దేశించి సింధియా మాట్లాడుతున్న సమయంలో బుకారెస్ట్ మేయర్ నిక్యూసర్ డాన్ అడ్డుతగిలారు. వారు ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు.. వారికి ఆహారం, ఆశ్రయం తాను కల్పించినట్టు చెప్పాలని, ఆ పని చేసింది మీరు కాదని అన్నారు. దానికి సింధియా స్పందిస్తూ.. తానేం చెప్పాలో మీరు నిర్ణయించడం సరికాదని, తనను మాట్లాడినివ్వాలని, దయచేసి ఆగాలని కోరారు. ఆ మాటలు విన్న మేయర్ కాస్తంత ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఆ తర్వాత మంత్రి మాట్లాడుతూ.. రొమేనియా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. భారతీయలకు రక్షణ కల్పించడంతోపాటు వారికి తరలింపు ప్రణాళికకు మద్దతుగా నిలిచిందుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సింధియా గురువారం కూడా రొమేనియా ప్రభుత్వానికి, రాయబార కార్యాలయానికి, ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 



Updated Date - 2022-03-05T00:31:21+05:30 IST