Bengaluru: ప్రైవేటు పాఠశాలకు బాంబు బెదిరింపు

ABN , First Publish Date - 2022-07-19T00:25:42+05:30 IST

నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్లో బాంబు (Bomb) పెట్టినట్టు వచ్చిన ఈ-మెయిల్‌లో బెంగళూరు (Bengaluru)లో కలకలం

Bengaluru: ప్రైవేటు పాఠశాలకు బాంబు బెదిరింపు

బెంగళూరు: నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్లో బాంబు (Bomb) పెట్టినట్టు వచ్చిన ఈ-మెయిల్‌లో బెంగళూరు (Bengaluru)లో కలకలం రేగింది. దక్షిణ బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఐడియల్ టౌన్‌షిప్‌లోని ఓ ప్రైవేటు స్కూలుకు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఓ ఈ-మెయిల్ వచ్చింది. అది చూసిన స్కూలు యాజమాన్యం వెంటనే అప్రమత్తమైంది. స్కూల్లోని 1500 మంది చిన్నారులను ఖాళీ చేయించి పక్కనే ఉన్న స్కూళ్లకు పంపారు.


స్కూలు  నుంచి సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్‌స్క్వాడ్, స్నిఫ్ఫర్‌ డాగ్స్‌తో స్కూలుకు చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. చివరికి అది ఉత్తుత్తి బాంబు బెదిరింపుగా తేల్చారు. ఈ-మెయిల్ పంపిన అజ్ఞాతవ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో స్కూలుకు సెలవు ప్రకటించారు.


Updated Date - 2022-07-19T00:25:42+05:30 IST