హిజాబ్‌తో విద్యాసంస్థల్లోకి రావొచ్చు

ABN , First Publish Date - 2022-02-23T07:59:49+05:30 IST

విద్యాసంస్థల లోపలికి హిజాబ్‌తో రాకపై తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది...

హిజాబ్‌తో  విద్యాసంస్థల్లోకి రావొచ్చు

 తరగతి గదిలోకి మాత్రం అనుమతి లేదు

హైకోర్టుకు తెలిపిన కర్ణాటక ప్రభుత్వం


బెంగళూరు, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): విద్యాసంస్థల లోపలికి హిజాబ్‌తో రాకపై తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే తరగతిగదిలో మాత్రం అనుమతి ఉండదని స్పష్టం చేసింది. హిజాబ్‌ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్థీ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఎదుట మంగళవారం కూడా విచారణ కొనసాగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ప్రభులింగ్‌ నావదగి వాదనలు కొనసాగించారు.   హిజాబ్‌తో కళాశాల లోపలికి వచ్చి తరగతి గదిలోకి వెళ్లేలోగా తొలగించాల్సి ఉంటుందని ఏజీ స్పష్టం చేశారు. విద్యార్థినులతో ఎక్కడా అమానవీయంగా వ్యవహరించేందుకు అవకాశం ఇవ్వబోమన్నారు. ఉపాధ్యాయుల తరఫు న్యాయవాదులు కూడా మంగళవారం వాదనలు వినిపించారు. యూనిఫాం అమలుకు సహకరించేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. 

Read more