హీరో విశాల్‌కు రూ.500 అపరాధం

ABN , First Publish Date - 2022-01-03T18:10:59+05:30 IST

స్టార్‌ హీరో విశాల్‌కు ఎగ్మోర్‌లోని ఆర్థిక నేరాల కోర్టు రూ.500 అపరాధం విధిస్తూ తీర్పునిచ్చింది.

హీరో విశాల్‌కు రూ.500 అపరాధం

ఎగ్మోర్‌ ఆర్థిక నేరాల కోర్టు ఆదేశం

చెన్నై/అడయార్‌, జనవరి 2: స్టార్‌ హీరో విశాల్‌కు ఎగ్మోర్‌లోని ఆర్థిక నేరాల కోర్టు రూ.500 అపరాధం విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు గత నెల 17వ తేదీన వెలువరించగా, ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నటుడు, నిర్మాత అయిన విశాల్‌పై జీఎస్టీ చెల్లించలేదనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై నేరుగా హాజరైన వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ  2016 నుంచి 2018 మధ్య కాలంలో జీఎస్టీ చెన్నై ప్రాంతీయ కార్యాలయ అధికారులు దాదాపు 10 సార్లు నోటీసులు జారీచేశారు. అయినప్పటికీ ఆయన హాజరు కాలేదు. దీంతో ఆయన పై చర్య తీసుకోవాలని కోరుతూ జీఎస్టీ చెన్నై జోన్‌ అధికారులు  ఎగ్మూరులోని ఆర్థిక నేరాల కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా విశాల్‌ తరపు న్యాయవాది కృష్ణా రవీంద్రన్‌ హాజరై జీఎస్టీ చట్టం మేరకు అధికారులే అపరాధం విధించవచ్చని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి విశాల్‌పై వచ్చిన ఆరోపణల స్థాయి తక్కువగా ఉండటంతో రూ.500 అపరాధం విధిస్తూ తీర్పు చెప్పారు. 

Read more