CI Rajeshwari: గుండెపోటు బాధితుడిని కాపాడిన సీఐ

ABN , First Publish Date - 2022-08-30T16:30:27+05:30 IST

గుండె పోటుకు గురైన వ్యక్తిని సకాలంలో ఆస్పత్రికి తరలించి ఆయన ప్రాణాలు కాపాడారు ఓ సీఐ. స్థానిక పట్టినపాక్కం బీచ్‌ వద్ద ఆదివారం రాత్రితొమ్మిది

CI Rajeshwari: గుండెపోటు బాధితుడిని కాపాడిన సీఐ

చెన్నై, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): గుండె పోటుకు గురైన వ్యక్తిని సకాలంలో ఆస్పత్రికి తరలించి ఆయన ప్రాణాలు కాపాడారు ఓ సీఐ. స్థానిక పట్టినపాక్కం బీచ్‌ వద్ద ఆదివారం రాత్రితొమ్మిది గంటల ప్రాంతంలో మురళి (48) అనే వ్యక్తికి ఉన్నట్టుండి గుండెపోటు వచ్చి నేలపై పడ్డాడు. విషయం తెలుసుకున్న సీఐ రాజేశ్వరి(CI Rajeshwari) అతడిని ఆటోలో ఎక్కించుకుని ఆస్పత్రికి బయలుదేరారు. మార్గమధ్యంలో లైట్‌హౌస్‌ ప్రాంతంలో వెళ్తున్న అంబులెన్స్‌ ఆపి మురళిని అందులో ఎక్కించి రాయపేట ఆస్పత్రి(Rayapet Hospital)కి తీసుకెళ్లాలని డ్రైవర్‌కు సూచించారు. వైద్యులు చికిత్స అందిండచంతో ఆయన కోలుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌.. సోమవారం రాజేశ్వరి(Rajeshwari)ని తన కార్యాలయంలో అభినందించి ప్రశంసాపత్రం అందించారు. 


Updated Date - 2022-08-30T16:30:27+05:30 IST