రక్తపోటు బాధితులు 60 లక్షలు

ABN , First Publish Date - 2022-04-10T15:56:20+05:30 IST

రాష్ట్రంలో 60 లక్షల మంది రక్తపోటుతో బాధపడుతున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌ తెలిపారు. ఆయన శనివారం తిరుచ్చిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో తనిఖీలు

రక్తపోటు బాధితులు 60 లక్షలు

                         - ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌


అడయార్‌(చెన్నై): రాష్ట్రంలో 60 లక్షల మంది రక్తపోటుతో బాధపడుతున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌ తెలిపారు. ఆయన శనివారం తిరుచ్చిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో ఉన్న సమయంలో మళ్లీ అవయవ దానాలు పెరిగాయన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రవేశపెట్టిన ‘మక్కలై తేడి మరుత్తువం’ అనే పథకం కింద ఇప్పటివరకు జరిపిన వైద్య పరీక్షల్లో 60 లక్షల మంది రక్తపోటుతో బాధపడుతున్నట్టు తేలిందన్నారు. రాష్ట్రంలో 6,640 మంది కిడ్నీలకు, 314 మందికాలేయం, 40 మంది గుండె అవయవాల కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. అదేసమయంలో రాష్ట్రంలో 92 శాతం మందికి కరోనా వ్యాక్సిన్‌ వేసినట్టు చెప్పారు. ఇందులో 1.37 కోట్ల మందికి రెండో డోస్‌ వేసుకోలేదని, 44 లక్షల మంది తొలి డోస్‌ వ్యాక్సిన్‌ వేసుకోలేదని వివరించారు. 

Updated Date - 2022-04-10T15:56:20+05:30 IST