సోనియాకు మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2022-12-10T01:08:34+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ప్రధాని నరేంద్రమోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.‘‘సోనియాజీకి

సోనియాకు మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు

న్యూఢిల్లీ, డిసెంబరు 9: కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ప్రధాని నరేంద్రమోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.‘‘సోనియాజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నా’’ అని మోదీ శుక్రవారం ఆమె 76వ జన్మదినోత్సవం సందర్భంగా ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు శశిథరూర్‌, సచిన్‌ పైలట్‌, కేసీ వేణుగోపాల్‌, అశోక్‌ గహ్లోత్‌, రణ్‌దీప్‌ సుర్జేవాలా ట్విటర్‌ వేదికగా సోనియాకు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2022-12-10T01:08:35+05:30 IST