గుజరాత్ ఆప్ కో-ఇంచార్జిగా ఎంపీ రాఘవ్ చడ్డా
ABN , First Publish Date - 2022-09-19T07:15:41+05:30 IST
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున కో-ఇంచార్జిగా రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డాను నియమిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆదివారం ట్విటర్లో ప్రకటించింది.

అహ్మదాబాద్, సెప్టెంబరు 18: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున కో-ఇంచార్జిగా రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డాను నియమిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆదివారం ట్విటర్లో ప్రకటించింది. ఇప్పటికే ఇంచార్జిగా ఎంపీ సందీప్ పాఠక్ వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది పంజాబ్లో జరిగిన ఎన్నికల సమయంలోనూ పార్టీ వ్యవహారాల కో-ఇంచార్జిగా చడ్డా బాధ్యతలు నిర్వర్తించారు. గుజరాత్లో 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఆప్ మారింది.