ప్రధాని మోదీపై గుజరాత్‌ ఆప్‌ చీఫ్‌ దూషణలు

ABN , First Publish Date - 2022-10-11T09:14:17+05:30 IST

గుజరాత్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియా, 2019లో ప్రధాని మోదీని దూషిస్తూ చేసిన వ్యాఖ్యల వీడియో తాజాగా నెట్టింట ప్రత్యక్షమై..

ప్రధాని మోదీపై గుజరాత్‌ ఆప్‌ చీఫ్‌ దూషణలు

నెట్టింట ప్రత్యక్షమైన వీడియో.. ఆప్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం

అహ్మదాబాద్‌, అక్టోబరు 10: గుజరాత్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియా, 2019లో ప్రధాని మోదీని దూషిస్తూ చేసిన వ్యాఖ్యల వీడియో తాజాగా నెట్టింట ప్రత్యక్షమై.. ఆప్‌, బీజేపీల మధ్య మాటల యుద్ధాన్ని రగిల్చింది. వీడియోలో ప్రధానిని ఒక నీచమైన వ్యక్తి అంటూ ఇటాలియా అభివర్ణించడం కనిపిస్తోంది. ప్రజలను ఆయన వెర్రివాళ్లను చేస్తున్నాడంటూ మరో దూషణ కూడా అందులో ఉంది. ఈ వీడియోపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆ వాఖ్యలు యావత్‌ గుజరాత్‌కు బాధ కలిగించేలా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోర్ధాన్‌ జడాఫియా పేర్కొన్నారు. తాను పటేల్‌ వర్గానికి చెందినవాడిని కాబట్టే బీజేపీ తనను లక్ష్యంగా చేసుకుందంటూ గోపాల్‌ ఇటాలియా ఆరోపించారు. ఆయనకు ఆప్‌ కూడా మద్దతుగా నిలిచింది.

Read more