Governor: ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టంపై ప్రభుత్వాన్ని వివరణ కోరిన గవర్నర్‌

ABN , First Publish Date - 2022-11-25T08:01:30+05:30 IST

ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టం వ్యవహారంలో మరింత వివరణ కావాలని రాష్ట్రప్రభుతాన్ని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) కోరారు. ఈ మేరకు ఆయ

Governor: ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టంపై ప్రభుత్వాన్ని వివరణ కోరిన గవర్నర్‌

చెన్నై, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టం వ్యవహారంలో మరింత వివరణ కావాలని రాష్ట్రప్రభుతాన్ని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. శాసనసభలో అక్టోబరు 23న ఆన్‌లైన్‌ రమ్మీ క్రీడను నిషేధిస్తూ ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించారు. దానిని గవర్నర్‌ ఆమోదం కోసం పంపారు. అయితే ఇప్పటి వరకూ గవర్నర్‌ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధం చేసే అత్యవసర చట్ట తీర్మానం ఈ నెల 27తో ముగియనుంది. అత్యవసర చట్టానికి ఆరు నెలలు, చట్ట తీర్మానానికి ఆరు వారాల్లోగా గవర్నర్‌ అంగీకారం తెలపాల్సి ఉంది. ఈ తీర్మానాన్ని ఆమోదించాలని కోరేందుకు రాష్ట్ర న్యాయశాఖమంత్రి రఘుపతి సైతం గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు. అయితే వాటన్నింటినీ తోసిరాజని ఈ ముసాయిదాపై మరిన్ని వివరాలివ్వాలంటూ గవర్నర్‌ ప్రభుత్వానికి లేఖ రాయడం గమనార్హం. అయితే గవర్నర్‌ లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆయన లేఖకు శుక్రవారమే వివరణ ఇవ్వనున్నట్లు న్యాయశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2022-11-25T08:01:30+05:30 IST

Read more