New CDS: కొత్త సీడీఎస్‌గా లెఫ్టినెంట్ జనరల్ చౌహాన్ (రిటైర్డ్) నియామకం

ABN , First Publish Date - 2022-09-29T01:23:24+05:30 IST

భారత కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్)ను కేంద్ర ప్రభుత్వం బుధవారంనాడు ..

New CDS: కొత్త సీడీఎస్‌గా లెఫ్టినెంట్ జనరల్ చౌహాన్ (రిటైర్డ్) నియామకం

న్యూఢిల్లీ: భారత కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్)ను కేంద్ర ప్రభుత్వం బుధవారంనాడు నియమించింది. 2021 డిసెంబర్ 8న తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అప్పటి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఆకస్మిత మృతితో ఆ పదవి ఖాళీ అయిన తొమ్మిది నెలలకు అనిల్ చౌహాన్ నియామకం జరిగింది. అనిల్ చౌహాన్ ప్రభుత్వ ప్రభుత్వ కార్యదర్శిగా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలటరీ ఆఫైర్స్ సైతం చూసుకుంటారని, ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తదుపరి ఉత్వర్వులు వెలువడేంతవరకూ సీడీఎస్‌గా కొనసాగుతారని  రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.


లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ సుమారు 40 ఏళ్ల సర్వీసులో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. కమాండ్, స్టాఫ్, ఇన్‌స్ట్రుమెంటల్ అపాయిమెంట్స్‌ నిర్వహించడంతో పాటు జమ్మూకశ్మీర్, ఈశాన్య ప్రాంతాల్లో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లు నిర్వహించిన అపారమైన అనుభవం ఉందని  రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 1961 మే 18న జన్మించిన అనిల్ చౌహాన్ 1981లో ఇండియన్ ఆర్మీ 11 గోర్ఖా రైఫిల్స్‌లో చేరారు. డెహ్రాడూన్‌లోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్య విద్యార్థి కూడా. మేజర్ జనరల్ ర్యాంకులో బారాముల్లా సెక్టార్‌లోని ఇన్‌ఫాంట్రీ డివిజన్ కమాండంట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత లెఫ్టినెంట్ జనరల్‌గా ఈశాన్య ప్రాంతాల్లో పనిచేశారు. జనరల్ ఆఫీసర్‌గా 2019 సెప్టెంబర్ నుంచి ఈస్ట్రన్ కమాండ్‌కు  కమాండింగ్ ఇన్ చీఫ్‌గా పనిచేశారు. మే 2021న పదవీ విరణమ చేసేంత వరకూ ఆ బాధ్యతల్లో కొనసాగారు. గతంలో అంగోలాలోని యునైటెడ్ నేషన్స్ మిషన్‌కు సేవలు అందించారు. 2021 మే 31న ఆయన పదవీ విరమణ చేశారు. ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన జాతీయ భధ్రత, వ్యూహాత్మక అంశాల్లో సేవలు అందించారు. ఆర్మీకి అందించిన  విశిష్ట సేవలకు గాను ''పరమ్ విశిష్ట సేవా మెడల్'', ''ఉత్తమ్ యుధ్ సేవా మెడల్'', ''అతి విశిష్ట సేవా మెడల్'' అందుకున్నారు.

Read more