golden shield: బ్యాంక్‌కు చేరిన బంగారు కవచం

ABN , First Publish Date - 2022-11-02T09:54:15+05:30 IST

దేవర్‌ జయంతి సందర్భంగా బ్యాంక్‌ లాకర్‌(Bank Locker) నుంచి తీసుకొచ్చిన బంగారు కవచం సాయుధ పోలీసు భద్రత

 golden shield: బ్యాంక్‌కు చేరిన బంగారు కవచం

పెరంబూర్‌(చెన్నై), నవంబరు 1: దేవర్‌ జయంతి సందర్భంగా బ్యాంక్‌ లాకర్‌(Bank Locker) నుంచి తీసుకొచ్చిన బంగారు కవచం సాయుధ పోలీసు భద్రత మధ్య తిరిగి బ్యాంక్‌కు తరలించారు. రామనాధపురం జిల్లా కళుది సమీపం పసుమ్‌పొన్‌ గ్రామంలోని ముత్తురామలింగ దేవర్‌ 115 జయంతి, 60వ గురుపూజను పురస్కరించుకొని అక్టోబర్‌ 26వ తేది రెవెన్యూ శాఖ అధికారులు మదురైలోని బ్యాంక్‌ లాకర్‌ నుంచి బంగారు కవచం తీసుకొచ్చి దేవర్‌ విగ్రహానికి అలంకరించారు. ఉత్సవాలు ముగియడంతో జిల్లా రెవెన్యూ అధికారి కామాక్షి గణేశన్‌ పర్యవేక్షణలో అధికారులు, నిర్వాహకులు విగ్రహం నుంచి బంగారు కవచం తొలగించి, సాయుధ పోలీసు భద్రత నడుమ మదురై బ్యాంక్‌కు తరలించి లాకర్‌లో భద్రపరిచారు.

Updated Date - 2022-11-02T09:54:18+05:30 IST