ప్రార్థనా మందిరాల్లో ప్రమాణం చేసి ద్రోహం

ABN , First Publish Date - 2022-09-17T08:39:43+05:30 IST

ఎన్నికల సమయంలో పలు ప్రార్థనామందిరాల్లో ప్రమాణాలు చేసిన తమ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించడం ద్వారా ద్రోహానికి పాల్పడ్డారని

ప్రార్థనా మందిరాల్లో ప్రమాణం చేసి ద్రోహం

ఫిరాయింపులపై కాంగ్రెస్‌ గోవా ఇన్‌చార్జి దినేశ్‌ ఆగ్రహం


బెంగళూరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో పలు ప్రార్థనామందిరాల్లో ప్రమాణాలు చేసిన తమ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించడం ద్వారా ద్రోహానికి పాల్పడ్డారని గోవా కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దినేశ్‌గుండూరావ్‌ మండిపడ్డారు. నగరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ అంశంపై ప్రజాకోర్టులోనే తేల్చుకుంటామని అన్నారు. దేశంలోని బీజేపీయేతర పార్టీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

Read more