refusing love proposal: బాలిక ప్రేమ ప్రతిపాదన తిరస్కరించిందని...యువకుడు ఏం చేశాడంటే....

ABN , First Publish Date - 2022-08-29T16:04:48+05:30 IST

ప్రేమ ప్రతిపాదనను (refusing love proposal) తిరస్కరించిందనే కోపంతో ఇంట్లో నిద్రపోతున్న బాలికపై(Girl) పెట్రోలు పోసి నిప్పంటించి...

refusing love proposal: బాలిక ప్రేమ ప్రతిపాదన తిరస్కరించిందని...యువకుడు ఏం చేశాడంటే....

దుమ్కా(జార్ఖండ్): ప్రేమ ప్రతిపాదనను (refusing love proposal) తిరస్కరించిందనే కోపంతో ఇంట్లో నిద్రపోతున్న బాలికపై(Girl) పెట్రోలు పోసి నిప్పంటించి, చంపిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని దుమ్కా పట్టణంలో(Jharkhands Dumka) వెలుగుచూసింది.దుమ్కా పట్టణానికి చెందిన 19 ఏళ్ల బాలిక కళాశాలలో 12వ తరగతి చదువుతోంది. అదే పట్టణానికి చెందిన షారుఖ్ అనే యువకుడు బాలికను ప్రేమిస్తున్నట్లు(love) ప్రతిపాదించాడు. తన ప్రేమ ప్రతిపాదనను బాలిక తిరస్కరించిందనే కోపంతో షారూఖ్ బాలిక నిద్రిస్తున్న సమయంలో ఆమె గది కిటికీ బయట నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాధిత బాలిక 90శాతం కాలిన గాయాలతో విషమ స్థితిలో దుమ్కాలోని ఫూలో జానో మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు.


మెరుగైన చికిత్స కోసం బాలికను రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)కు తరలించారు. ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతూ బాలిక మరణించిందని దుమ్కా టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ నితీష్ కుమార్ చెప్పారు.మెజిస్ట్రేట్ కు ఇచ్చిన వాంగ్మూలంలో బాలిక షారూఖ్ నిప్పంటించిన విషయాన్ని వెల్లడించింది.బాధిత బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దుమ్కా పట్టణంలో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. 


దీంతో శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా యంత్రాంగం 144 సెక్షన్‌(Section-144 CrPC) విధించింది.దుమ్కా పట్టణంలోని దుధాని చౌక్‌లో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ (Viswa Hindu Parishad and Bajrang Dal) కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించి మృతురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ డివిజనల్ పోలీసు అధికారి విజయ్ కుమార్‌కు వినతి పత్రం సమర్పించారు.


Updated Date - 2022-08-29T16:04:48+05:30 IST