Viral: బాలిక కిడ్నాప్‌ అంటూ వీడియో వైరల్‌

ABN , First Publish Date - 2022-09-14T17:50:57+05:30 IST

బళ్లారిలో ఓ బాలికను దుండగులు కిడ్నాప్‌ చేశారంటూ ఓ వీడియో(Video) సామాజిక మాద్య మాల్లో మంగళవారం వైరల్‌ అయింది.

Viral: బాలిక కిడ్నాప్‌ అంటూ వీడియో వైరల్‌

                           - కాదని తేలడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు 


బళ్లారి(బెంగళూరు), సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): బళ్లారిలో ఓ బాలికను దుండగులు కిడ్నాప్‌ చేశారంటూ ఓ వీడియో(Video) సామాజిక మాద్య మాల్లో మంగళవారం వైరల్‌ అయింది. కాని వారు కిడ్నాపర్లు కాదని తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గంగమ్మ, రామాంజినప్ప దంప తులు. వీరికి ముగ్గురు పిల్లలు. గంగమ్మది బళ్లారి కాగా రామాంజినప్పది వైఎస్‌ఆర్‌ జిల్లా (కడప) జమ్మలమడుగు. మనస్పర్థల కారణంగా కొంతకాలంగా గంగమ్మ పుట్టింటిలో ఉంటోంది. పెద్ద కుమారుడు తండ్రి వద్ద, ఒక బాబు, ఒక పాప తల్లి వద్ద ఉంటున్నారు. తండ్రి వద్ద ఉన్న పెద్దకుమారుడు తనకు చెల్లెలను చూడాలనిపి స్తోందని రోదిస్తుంటే చూపించడానికి మంగళవారం వచ్చారు. పాపను తన వెంటే తీసుకుపోతానని అత్తమామలను, భార్యను రామాంజినప్ప కోరగా వారు తిరస్కరిం చారు. పాపను కొద్దిసేపు బయటకు తీసుకెళ్తానని చెప్పిన రామాంజినప్ప ఆ బాలికను తను వచ్చిన జీపులో తీసుకొని వెళ్లిపోయాడు. దీన్ని గమనించిన గంగమ్మ(Gangamma) గట్టిగా కేకలు వేస్తూ ఆ జీపు వెంట పరుగులు తీసింది. 

    విషయం తెలియని స్థానికులు ఆ పాపను దుండగులు కిడ్నాప్‌ చేసుకొని వెళ్తున్నారని భావించి.. ఆ జీపును కొంత దూరం వరకు వెంబడించారు. ఫలితం లేకపోవడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ పుటేజీ(cc putage)లో రికార్డు అయిన ఈ సీన్‌ సామాజిక మాద్యమాల్లో క్షణాల్లోనే వైరల్‌ అయింది. పోలీసులు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అసలు విషయంపై ఆరా తీశారు. పాపను తీసుకెళ్లింది తండ్రేనని, కిడ్నాపర్లు కాదని తేలడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. తండ్రిని పిలిపించి.. పాపను తల్లికి అప్పగించారు. 

Read more