గులాం నబీ కొత్త పార్టీ ‘డెమోక్రటిక్‌ ఆజాద్‌’

ABN , First Publish Date - 2022-09-27T07:42:22+05:30 IST

జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌ డెమోక్రటిక్‌ ఆజాద్‌ పార్టీ పేరుతో సోమవారం కొత్త పార్టీని ప్రారంభించారు.

గులాం నబీ కొత్త పార్టీ ‘డెమోక్రటిక్‌ ఆజాద్‌’

శ్రీనగర్‌, సెప్టెంబరు 26 : జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌ డెమోక్రటిక్‌ ఆజాద్‌ పార్టీ పేరుతో సోమవారం కొత్త పార్టీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ప్రజాస్వామ్య సూత్రాల మీద నిర్మితమైందని చెప్పారు. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ సిద్ధాంతాలు, ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. పార్టీలోని ఆజాద్‌కు, తన పేరుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రె్‌సలో కీలకంగా పనిచేసిన ఆజాద్‌.. ఆగస్టు 26న ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే.

Read more