GCC మేయర్‌ ఎవరో ?

ABN , First Publish Date - 2022-02-23T14:17:03+05:30 IST

ఘనచరిత్ర సంతరించుకున్న గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ)కు ఎన్నికల ఫలితం తేలిపో యింది. ఈ కార్పొరేషన్‌ను డీఎంకే సొంతం చేసుకోవడంతో మేయర్‌ పీఠం ఎవరి కైవసం కానుం దోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

GCC మేయర్‌ ఎవరో ?

                      - 4న అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు పరోక్ష ఎన్నిక


ప్యారీస్‌(చెన్నై): ఘనచరిత్ర సంతరించుకున్న గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ)కు ఎన్నికల ఫలితం తేలిపో యింది. ఈ కార్పొరేషన్‌ను డీఎంకే సొంతం చేసుకోవడంతో మేయర్‌ పీఠం ఎవరి కైవసం కానుం దోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. నగర మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులకు మార్చి 4న పరోక్షపద్దతిలో ఎన్నిక జరుగనుంది. 200 వార్డులు కలిగిన ఈ కార్పొరేషన్‌కు 2011వ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. అప్పుడు మేయర్‌, కౌన్సిలర్ల పదవీకాలం 2016తో ముగిసింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగలేదు. పదేళ్ల అనంతరం కార్పొరేషన్‌, మున్సిపాలిటీ, పట్టణ పం చాయతీలకు ఈ నెల 19న ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జీసీసీ లోని 200 వార్డుల్లో 26,94,785 మంది ఓటు హక్కు వినియోగిం చుకున్నారు. మంగళ వారం జోన్ల వారీగా జరిగిన ఓట్ల లెక్కింపులో డీఎంకే, మిత్రపక్షాల అభ్యర్థులు తిరుగులేని మెజారిటీతో గెలిచారు. వీరు మార్చి 2న రిప్పన్‌ భవనంలోని సమావేశ మందిరంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత కొత్త మేయర్‌, డిప్యూటీ మేయర్‌లను కౌన్సిలర్లు 4వ తేది పరోక్షంగా ఎన్నుకోనున్నారు. ఇదిలా ఉండగా, డీఎంకేలో సీనియర్లు, ఆ పార్టీ బలోపేతానికి కృషిచే సిన కౌన్సిలర్ల వివరాలను పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తోందని, ఒకటి, రెండు రోజుల్లో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థులను అధికారపూర్వకంగా ప్రకటించే అవకాశముందని డీఎంకే వర్గాల సమాచారం.


ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న రిప్పన్‌ భవనం

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కొత్త కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి రిప్పన్‌ భవనం సిద్ధమవుతోంది. 334 సంవత్సరాల చరిత్ర కలిగిన రిప్పన్‌భవనాన్ని 1688 సెప్టెంబరు 29న ఆంగ్లే యుల పాలనలో నిర్మించారు. ఆనాటి కట్టడాన్ని చెక్కుచెదర కుండా అధికారులు కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరేళ్ల తర్వాత జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో 200 వార్డుల్లో గెలిచిన కౌన్సిలర్లు మార్చి 2న ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో భనవంలో కార్పొరేషన్‌ సమావే మందిర మరమ్మతు పనులు ఇటీవలే ముగిశాయి. మేయర్‌ కుర్చీని అందంగా సిద్ధం చేస్తున్నారు. మేయర్‌గా ఎన్నికైన వ్యక్తి 18 సవర్ల బంగారు హారాన్ని, ప్రత్యేక అంగీని ధరించనున్నారు. ఆ బంగారు గొలుసును ప్రముఖ పారిశ్రామిక వేత్త రాజా సర్‌ ముత్తయ్యచెట్టి తన సొంత ఖర్చుతో తయారు చేయించారు. తన తర్వాత మేయర్‌గా ఎన్నికయ్యే వారు ఆ బంగారు గొలుసును ధరించేందుకు వీలుగా దానిని కార్పొరేషన్‌కు కానుకగా అందించారు. అప్పటి నుండి కార్పొరేషన్‌ మేయర్లు ప్రత్యేక అంగీ, ఆ బంగారు గొలుసును ధరించి సమావేశాల్లో పాల్గొనటం ఆనవాయితీ. ఈ సారి ఆ హారం ఎవరి మెడను అలంకరించ నుందోనని డీఎంకే వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Updated Date - 2022-02-23T14:17:03+05:30 IST