తల కోసి.. తోలు తొలిచేశారు

ABN , First Publish Date - 2022-12-30T00:50:25+05:30 IST

మహిళపై మూకుమ్మడిగా అత్యాచారం చేశారు. అంతటితో ఆగక ఆమె ప్రాణాలు తీశారు. ఆపై పదునైన ఆయుధంతో తలను వేరు చేశారు. బాధితురాలి ముఖం, శిరస్సుపై ఉన్న చర్మాన్ని మొత్తం తొలిచేశారు.

తల కోసి.. తోలు తొలిచేశారు

పదునైన ఆయుధంతో ఛాతీ ముక్కలు

పాక్‌లో హిందూ మహిళపై గ్యాంగ్‌ రేప్‌, హత్య

ఇస్లామాబాద్‌/న్యూఢిల్లీ, డిసెంబరు 29 : మహిళపై మూకుమ్మడిగా అత్యాచారం చేశారు. అంతటితో ఆగక ఆమె ప్రాణాలు తీశారు. ఆపై పదునైన ఆయుధంతో తలను వేరు చేశారు. బాధితురాలి ముఖం, శిరస్సుపై ఉన్న చర్మాన్ని మొత్తం తొలిచేశారు. ఆమె ఛాతీ భాగాన్ని అతి దారుణంగా కోసేశారు. పక్కటెముకలు బయటపడేలా తోలును తొలగించారు. అంతిమంగా ఆ శరీర భాగాలను ఓ గోధుమ చేనులో విసిరేశారు. పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రాంతంలో బుధవారం జరిగింది ఈ పాశవిక హత్య. సింఝోరో జిల్లా కేంద్రంలో 40 ఏళ్ల హిందూ మహిళపై కొంతమంది దుండగులు అత్యాచారం చేసి, దారుణంగా చంపేశారు. ఆమెను భిల్‌ గిరిజన తెగకు చెందిన దియా భిల్‌గా గుర్తించారు. వితంతువు అయిన ఆ మహిళకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఘటనా ప్రాంతానికి వెళ్లిన పోలీసులు స్నిఫర్‌ డాగ్స్‌ సహాయంతో ఆధారాల కోసం గాలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం వెతుకుతున్నారు.

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సింఝోరోలో పలువురు ఆందోళన చేశారు. గిరిజన మహిళపై జరిగిన దారుణాన్ని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ సెనెటర్‌ కృష్ణ కుమారి ఖండించారు. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె కుటుంబసభ్యులను ఓదార్చారు. పాకిస్థాన్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై ఇటీవల దాడులు మరింత ఎక్కువయ్యాయి. హిందూ మహిళల కిడ్నా్‌పలు, అత్యాచారాలు, బలవంతపు వివాహాలు, హత్యలు పెరిగిపోయాయి. కాగా, పాక్‌ ప్రభుత్వం మైనారిటీలకు రక్షణగా నిలవాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందం బగ్చీ విజ్ఞప్తి చేశారు. మైనారిటీల భద్రతపై సర్కారు దృష్టిసారించాలని పలుమార్లు కోరామని గురువారం మీడియాకు తెలిపారు.

Updated Date - 2022-12-30T00:50:25+05:30 IST

Read more