Gali Janardhan Reddy: గాలి మళ్లింది.. ఎందుకో..?

ABN , First Publish Date - 2022-12-10T12:22:21+05:30 IST

ఒకప్పుడు బళ్లారి రాజకీయాలను శాసించిన గాలి జనార్ధన్‌ రెడ్డి(Gali Janardhan Reddy) ఇప్పుడు గంగావతి నుంచి పోటీ చేస్తా

Gali Janardhan Reddy: గాలి మళ్లింది.. ఎందుకో..?

- గంగావతి నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన గాలి జనార్దన్‌ రెడ్డి

- బీజేపీలో తగ్గిన హవా

- కొత్త పార్టీపై ఊహాగానాలు

బళ్లారి(బెంగళూరు), డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు బళ్లారి రాజకీయాలను శాసించిన గాలి జనార్ధన్‌ రెడ్డి(Gali Janardhan Reddy) ఇప్పుడు గంగావతి నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బళ్లారి తన హవా తగ్గినందునే స్థానమార్పు కోరుకుంటున్నారా.. లేక మరేవైనా కారణాలున్నాయా అన్నది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో ఇప్పుడు గాలి హవా బాగా తగ్గింది. కనీసం గౌరవం కూడా దక్కడం లేదు. అలాగని కొత్త పార్టీ పె ట్టినా దైర్యంగా ఆయన వెంట వచ్చేవారు దాదాపు లేరనే చెప్పవచ్చు. ఆయన అత్యంత సన్నిహితులైన మంత్రి శ్రీరాములు, సోదరులు బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, హర్పణహళ్లి ఎమ్మెల్యే గాలి కరుణాకర్‌రెడ్డి, కంప్లి మాజీ ఎమ్మెల్యే సురేష్ బాబు, మాజీ ఎంపీ పక్కీరప్ప ఇలా గాలి జనార్దన్‌రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే వారేనిర్మొహమ్మాటంగా కొత్త పార్టీ పెట్టినా దైర్యం చేయలేం అని తెగేసి చెప్పినట్లు సమాచారం. అక్రమ మైనింగ్‌ కేసులో గాలి జనార్దన్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసినప్పటి నుంచి బీజేపీ పార్టీ రాజకీయంగా ఆయనను కాస్త దూరంగానే ఉంచినట్లు చెబుతున్నారు. ఇక బీజేపీ సైతం కీలక కార్యక్రమాలకు గాలిని దూరం గానే పెట్టింది. ఒకప్పుడు బళ్లారిలో బీజేపీ పార్టీ జెండా ఎగరడానికి గాలి జనార్దన్‌రెడ్డే కారణం అని ఆయన సన్నిహితులు కొందరు అంటున్నా మరికొందరు పార్టీ గొప్పది.. ఆయన కాకుంటే ఇంకోక్కరు అనే రీతిలో ప్రస్తుత బీజేపీ పార్టీ నాయకులు అంటున్నారు. పార్టీలో సీనియర్‌ నాయకుడు రామలింగప్ప లాంటి నాయకులు ఏకంగా ప్రెస్స్‌మీట్‌ పెట్టి విమర్శంచడం రాజకీయంగా పెద్ద చర్చ సాగింది. గాలి సైతం తనను బీజేపీ నిర్లక్ష్యంగా వ్య వహరిస్తున్నట్లు పబ్లిగ్గానే విమర్శించడం కొసమెరుపు. ఇది ఇలా కొనసాగుతుండగానే కొప్పళ జిల్లా గంగావతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, అక్కడే కొత్త భవనం కొనడం విశేషం. అయితే ప్రతి పక్ష కాంగ్రెస్‌, బీజేపీలో కొందరు కూడా అదంతా గాలి కొత్త డ్రామా అంతే బళ్లారిలో ఉండేందుకు కోర్టు అనుమతి లేదు, అందుకే పక్కజిల్లా అయిన గంగావతిలో ఇళ్లు తీసుకున్నారు. అని తేలికగా కొట్టిపారేస్తున్నారు. బీజేపీ ఆయనను పూర్తీగా దూరం చేసింది. ఆ పార్టీలో టికెట్‌ ఇచ్చే పరిస్థితి దాదాపు లేదు, ఇది కూడా రాజకీయ డ్రామాలో ఫార్టు టూ డైలాగ్‌ అంతే. అని కొట్టి పారేస్తున్నారు. అయితే రాజకీయ దర్భార్‌, అక్రమ మైనింగ్‌లో విచ్చల విడిగా డబ్బులు సంపాదన, ఇంత చూసిన గాలి మౌనంగా ఉంటారా.? అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. మరి గాలి రాజకీయంగా గమ్యం ఏమిటి..? అసలు కొత్త పార్టీ పెడుతారా..? లేదా బీజేపీతోనే కొనసాగేందుకు రాజకీయ ప్రయత్నాలు చేస్తారా..? కాలం కోసం ఎదురు చూద్దాం అని కొందరు పేర్కొంటున్నారు. గాలి రాజకీయ ఎత్తుగడలు ఎవరికి లాభం.. ఎవరికి న ష్టం.. అసలు రాజకీయ గాలి రాజకీయ ఎత్తుగడ ఏమిటో తేలాలంటే వేచి చూడాల్సిందే.

Updated Date - 2022-12-10T12:22:57+05:30 IST